ఓ కైలాస గిరివాసా | మము కరుణించు సర్వేశా | శివ భజన | లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
8,074 views
100

 Published On Jun 19, 2024

ఓ కైలాస గిరివాసా | మము కరుణించ రావయ్యా |

" ఓకైలాస గిరివాసా
మము కరుణించు సర్వేశా
ఈ ఇలయందునా మా మన సందునా
నిలచి యున్నావు అణువణువునా ॥ ఓకైలాస॥

ఏవేళనైనా యే కాలమైనా
నీ నామమే మరువమయ్యా
యెవరేమియన్నా యే ఆపదున్నా
నీ సేవనే విడువమయ్యా - 2
మమతలొ మాయలొ మసలేటి మమ్మ
మురిపించి మము కావ లేవా దేవా -2
!!ఈ యిలయం దున!!

అలనాడు గరళం సేవించి లోకం
కాపాడినా నీల కంఠా
నీ ఆత్మలింగం అడ్డగిసిన క్షణమే
ఆర్పించినా పరమేశ్వరా
ఈ దీనునీ బాధ నీవేల వినవూ -2
కన్నీటి మా గాథ కనవా దేవా-2-
!! ఈ యిలయందునా!!

శ్రీ మల్లిఖార్జున మహదేవ శంకర
జగదీశ్వర ఓ నట శేఖరా
శ్రీ నాగభూషణ ఓ నంది వాహన
గంగాధ రా ఓ గౌరీ వరా
హే చంద్ర వదనా కైలాస పాలన -2
త్రినేత్రాహరణ శివ శంభోహరా -2
॥ ఈ యిలయందునా మా మనసందునా ॥

రాగం : మోహన
కీబోర్డ్, స్వరకల్పన & గానం : రావికోటి అరవింద్ శర్మ
డోలక్ : రమేశ్ బృందావన్

show more

Share/Embed