ఆదిదేవా ఆనంద రూపా! వినాయక చవితి స్పెషల్ సాంగ్! లిరిక్స్ 👇
Telugu Bhajana Malika Telugu Bhajana Malika
1.46K subscribers
7,133 views
113

 Published On Sep 3, 2024

ఆది దేవా ఆనంద రూపా
కొలచిన చాలును కరుణాంతరంగా

పుణ్యమేదో పురుషార్థ మేదో
ఇంచుకైననూ తెలియగ లేదూ
నీ చరణమ్ముల శరణని యంటిని
చలనము కలుగగ లేదా
కరుణను చూపవ కారుణ్య ధామా !! ఆది దేవా !!

మంగళకరమౌ నీ దివ్య నామము
మదిలో వేడితి మానస రూపా
నాగతి నీవని నిజముగ నమ్మితి
గౌరీ నందన రావా
దేవ గణాధిప దరిజెర్చ లేవా !! ఆది దేవా!!

చల్లగ సాగే సెలయేటి వోలే
నిరతము సాగని అరవింద గానము
పరి పరి విధముల ప్రార్థన చేసి
పరితపించితిని రావా
మధుర సుధారసం నీ దివ్య చరితం
!! కొలచిన చాలును!!
రాగం : రేవతి
రచన,స్వరకల్పన,కీబోర్డ్&గానం :రావికోటిఅరవింద్ శర్మ.
డోలక్ : రమేశ్ బృందావన్
కీబోర్డ్ సహకారం : రామకృష్ణ

show more

Share/Embed