#రాజాధిరాజు
Atmarakshana Ministries Atmarakshana Ministries
650 subscribers
587 views
27

 Published On Apr 30, 2024

ప॥ రాజాధిరాజు యేసుడు - దేవాది దేవుడు క్రీస్తుడు
     త్వరలో రానైయున్నాడు - కొని పోవనున్నాడు
      కీర్తించుడి కొనియాడుడి - స్తోత్రించుడి సన్నుతించుడి
      సంతసించి ప్రభుని చెంత చేరి కొల్వుడి

1) ప్రధానదూత శబ్దముతో - వేలాది దూతల సమూహముతో
     ఆర్భాటముతో మహ మహిమతో రానైయున్నాడు
విడువబడక మునుపే మీరు రక్షణ పొంది ప్రార్థించుడి
                                                                                 ॥ రాజా॥

2) కొదమ సింహపు రీతిగాను - ప్రళయాగ్నివంటి గర్జనతోనూ
     రెప్పపాటున వచ్చున్ - రయముగ రాకడలో కొనిపోవున్
     వేడుడి ప్రార్ధించుడి - సిద్ధముగా నుండుడి               ॥ రాజా॥

3) తండ్రిరాక కుమారుడైనను ఎరుగడు
    మరి నీకు ప్రభురాక తెలియునా
    సిద్దెవంటి హృదయమును - భద్రపరచి తైలముతో నింపుడి
                                                                                 ॥ రాజా॥

show more

Share/Embed