Neeve Naa Aadharamu||
Shailamu Faith Ministries Official Shailamu Faith Ministries Official
21.8K subscribers
257,119 views
2.5K

 Published On Premiered Jul 20, 2023

పల్లవి:- ఏ క్షణమైనా నా జీవితానా, ఏ క్షణమైనా నా జీవితాన.
అ.ప:- నీవే నా ఆధారమూ.నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా-నీవే నా ఆనందమూ.
వర్ణింప నా తరమా? నీ ప్రేమా.!-వివరింపగ సాధ్యమా?నీ కరుణ!వివరింపగా సాధ్యమా.!
చ.1.ఓ తల్లి బిడ్డను మరచునటా గానీ!-నీవు నన్నెప్పుడు మరువవటా!.||2||
నా అరచేతిలో చెక్కితి చూడనీ||2||
దక్షిణ హస్తము చాపే కదా!
తన దక్షిణ హస్తము చూపే కదా!
ఏ క్షణమైనా నా జీవితాన.ఏ క్షణమైనా నా జీవితాన,
నీవే నా ఆధారమూ-నీవే నా ఆనందమూ. నీవే నా ఆధారమూ యేసయ్యా నీవే నా ఆనందమూ.
చ.2.ఓ మనిషి మాటిచ్చి మరచునటా గానీ, నీ మాటలెన్నడు మారవటా! ||2||
సర్వము మాటతో పలికి సృజించిన||2|| సర్వజ్ఞుడవూ నీవే కదా!||2||
ఏ క్షణమైనా నా జీవితాన||2||
నీవే నా ఆధారమూ-నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా-నీవే నా ఆనందమూ.
చ.3.మంటికి మారే మనిషినటా గానీ! మహిమ పాత్రగా మలిచెనటా!||2||
మార్గములన్నిటా అడుగులు జారక||2|| దూతల కాపలా పంపే కదా!దేవ,దూతల కాపలా పంపు కదా!ఏ క్షణమైనా నా జీవితాన||2||
నీవే నా ఆధారమూ-నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా-నీవే నా ఆనందమూ.
చ.4.కన్నీరు లేని రాజ్యమటా! అది కళ్యాణ శాశ్వత శోభనటా! ||2||
అర్హత లేని అన్య జనాంగమును! అర్హత లేని అల్పులందరినీ!ఆ మహిమ రాజ్యము చేర్చు కదా!ఆ మహిమ రాజ్యము చేర్చే కదా!
ఏ క్షణమైనా నా జీవితాన||2||
నీవే నా ఆధారమూ-నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా-నీవే నా ఆనందమూ.వర్ణింప నా తరమా? నీ ప్రేమా!- వివరింపగా సాధ్యమా? నీ కరుణా! వివరింపగా సాధ్యమా!
అనుక్షణము కనుపాప వలే కాచి కాపాడే దేవుడు, తన రెక్కల నీడలో దాచి కాపాడే దేవుడు, తల్లి తన బిడ్డను మరచినా,మరువనని,నీతి గల తన దక్షిణ హస్తము తో కుడిచేతిని పట్టుకొని నడిపించే దేవుడు,ఏ క్షణమైనా విడువక తోడున్నాడు గనుకనే,సజీవుల లెక్కలో నిలిచి ఈ మాటలు రాస్తున్నా,ఈ పాటలు పాడుతున్నా.నేనేమై యున్నానో అది కేవలం నా యేసయ్య కృప వలన అని,నా శిరమును వంచి సాగిలపడి ప్రభువు పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చెల్లిస్తూ ఒప్పుకుంటున్నాను.ఇది ప్రభువు మహా కృప,వర్ణింప నా తరము కాదు.వివరింప నా వశము కాదు,సాధ్యము కానే కాదు.కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు పాద సన్నిధిలో ఈ పాట తలంపులు ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మహా కృప చేత ఈ పాట రాయించి పాడించారు,అయితే అనేకుల హృదయాలలో ఈ పాట చేరాలి,ప్రభువు మహిమ పరచ బడాలీ అని,వ్యయ ప్రయాసలకోర్చి,ఆత్మీయుల ప్రార్థనలతో,సహకారము,ప్రోత్సాహముతో, ఆత్మ దేవుని నడిపింపుతో మీ ముందుకు ఈ పాట సిద్ధ పడి వస్తుండగా,ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో శతృ ప్రయత్నాలు,అంత మాత్రమే కాదు, ఈ గుండెని ఆపేయాలని అపవాది అహర్నిశలు కృషి చేశాడు.కానీ లోకమును జయించిన క్రీస్తు, మరణాన్ని గెలిచి,తిరిగి లేచిన క్రీస్తు,యుగ యుగములకు సజీవుడైనా క్రీస్తుప్రభువు,మరణ కరమైన ప్రాణాపాయము,రోడ్డు ప్రమాదము నుండీ,తన హస్తము చాపి ఆదుకున్నాడు,ICU లో ముఖమంతా రక్తమయం తో,మరణ పడక మీద పడి ఉన్నప్పుడు,శ్వాస కూడా సరిగ్గా అందని ఆ పరిస్థితి లో,వెంటిలేటర్ ఎక్కించాల్సిన పరిస్థితిలో,ఈ గుండె ఆగకుండా, తన ఊపిరి నాలో నింపి, తన పునరుద్ధాన శక్తి, జీవము తో నింపి,ఈ గుండెలోని పాటల ఊటలను మీ వరకు, రాబోవు తరములకు ప్రవహింపజేస్తున్నాడు. ఎంతైనా నా విమోచకుడు సజీవుడు, నమ్మదగిన దేవుడు,వాగ్ధానము చేసి దానిని నెరవేర్చుటకు సమర్థుడు.హల్లెలూయ.దేవునికి స్తోత్రము.ఈ గుండెలో ఊపిరి ఉన్నంత వరకు, ఈ మంటి దేహము మరలా మంటికి చేరేంత వరకు,నా యేసయ్య మహిమ కొరకే,ఆయన చిత్తము నెరవేర్చ బడుట కొరకే,ఇక వేరే ఆశ, ధ్యాస,ఏమి లేదు.నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభము.మీఅందరి ప్రశస్తమైన ప్రార్థనలతో,ప్రభువు మహా కృప తో మరలా మీ ముందు ఈ పాట అందిస్తున్నాను.ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక.
నా ప్రతీపరిస్థితిలో ప్రక్క నిలిచి పలకరిస్తున్న, ప్రార్థిస్తున్నా,పరిచర్య చేస్తున్న,సంఘబిడ్డలకు, సేవకులకు,తోటి జత పనివారికి,ఆత్మీయ నాయకులకు,దేవుడిచ్చిన నా సహచరికి,నా సంతానము,ఆత్మీయ సంతానమునకు,నా హృదయపూర్వక నిండువందనములు, కృతజ్ఞతలు,తెలుపుకుంటున్న.దేవునికి స్తోత్రము.హల్లెలూయ.ఆత్మీయ నాయకులు,గొప్పదైవజనులు,కన్నీటి ప్రార్థనా యోధులు,ఎజెకియా అన్నా,బెనిటా అన్నీ గార్లకు,బెరాకా ప్రవచనాత్మక పరిచర్యలకు,నాయకులకు,ప్రార్థనా వీరులకు,నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నిండు వందనములు.దేవునికిస్తోత్రము.
సంఘమంతటికి,ఎన్నిక లేని నన్ను సొంతం చేసుకొని మరుగున ప్రార్థించు ప్రతీ ఒక్కొక్కరికి,సహో.ప్రసన్నకుమార్ గారికీ, సహో.హేమచంద్ర గారికీ, పాస్టర్.స్వామీ గారికీ, నా హృదయపూర్వక, నిండువందనములు, కృతజ్ఞతలు,దేవునికి స్తోత్రము.
ప్రార్థించండి.ఈ పాట విని ప్రభువును మహిమ పరచండి,పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించండి.ప్రభువు మిమ్మును దీవించు గాక.వందనములు.దేవునికి స్తోత్రము.
మంచిసంగీతాన్ని,సమకూర్చిన, ఆత్మీయ సహో.అశోక్.యం.గారికీ,నా నిండు వందనములు కృతజ్ఞతలు.
పాట మొదలు నుంచీ ఆఖరి వరకు బాధ్యత తీసుకోని,మరుగున ప్రయాస పడిన,ప్రార్థించిన,గుప్పిలి విప్పిన, క్రీస్తు నందు నా ప్రియసహోదరుడు.వినయ్, సహోదరీ.రక్షిత,తన కుటుంబమునకు నా హృదయపూర్వక నిండు వందనములు కృతజ్ఞతలు.
సమయం కేటాయించి,వీడియో ఎడిటింగ్ సమకూర్చిన,పాట భావమును, దృశ్యరూపంగా చూపడానికి,ప్రయాసపడిన, ప్రియసహోదరుడు,రాయుడుగారికి,నా నిండు వందనములు కృతజ్ఞతలు.
ప్రయాణములో సహాయముగా నిలిచిన సహో. వెంకట్ గారికీ వందనములు,కృతజ్ఞతలు,
ఎడిటింగ్,లో ప్రక్క నిలిచి సహాయము చేసిన నా సతీమణి,శిరీషకును,
కుమారుడు సీయోనురాజు కునూ,కుమార్తె, షాలేమ్ రోజాకును.నాహృదయపూర్వక కృతజ్ఞతలు,అభినందనలు,దేవునికి మహిమ కలుగును గాక.
ఈ పాటను నా క్షేమంకోరి కన్నీళ్ళతో ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో ఎత్తిపట్టి,ప్రభువు మహిమ కొరకు నన్ను సిద్ధ పరచిన, నా ఆత్మీయ తండ్రీ, దైవజనులు,పాస్టర్.అబ్రహాము.కే.డీ.సామ్యేల్ గారికి,అంకితము.
సమస్త మహిమ యేసయ్య నామమునకు కలుగును గాక.హల్లెలూయ.
#ప్రభువు పాద సన్నిధిలో.మీ సహో.
#Sri Shailamu.
#Shailamu Faith Ministries Official.
#House Of Prayer For All Nations.
#Nalgonda.
#9505721217.
copyright ©️

show more

Share/Embed