గుండె చెదరినవారిని ఆదరించే దేవుడా...చెదరిన గుండెలకు ఆదరణGunde chedirina vaarini By Bro.Sri Shailamu.
Shailamu Faith Ministries Official Shailamu Faith Ministries Official
21.8K subscribers
749,369 views
3.7K

 Published On May 20, 2015

గుండెచెదరినవారిని ఆదరించే దేవుడా
గూడుచెదరిన పక్షుల చేరదీసే నాధుడా
త్యాగశీలుడా నీకొందనాలయ్యా
నా హృదయ పాలకా స్తోత్రమేసయ్యా
" గుండెచెదరిన "

లోకమను అరణ్యయాత్ర భారమాయెను
బహు దూరమాయెను
నా గుండెనిండ వేదనలే నిండియుండెను నిందించుచుండెను
కన్నీరేనాకు అన్నపానమాయెను " 2 "
దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను
బహు ఘోరమాయెను " గుండెచెదరిన "

మనిషి మనిషి నోర్వలేని మాయలోకము శూన్యఛాయలోకము
మాటలతో గాయపరచే క్రూరలోకము అంధకారలోకము
ఒంటరి తనమే నాకు స్నేహమాయెను " 2 "
దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను
బహు ఘోరమాయెను " గుండెచెదరిన "

కష్టాల కడలి అలలునన్ను కమ్ముకున్నవి
నను అలుముకున్నవి
కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది
పొరలి సంద్రమైనది
శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
ప్రాణార్పణముగ నేను పోయబడితిని సిలువసాక్షినైతిని " గుండెచెదరిన "

©®™©®™©®™©®™©®™©®™©®™

రచన, స్వరకల్పన, గానం
** : బ్రదర్. శ్రీ శైలము గారు***
Contact : 9505712127
Music : G . L . నాందేవ్ గారు
* Typing. Beloved Brother.
***Kedari- ఏలూరు**
©®™©®™©®™©®™©®™©®™©®™
నా గుండె లోతుల్లోంచి... మీతో...
శరీరానికి దెబ్బతగిలితే రక్త మొస్తది కదా!
అట్లాగే గుండెకు తగిలిన వేల గాయాలలోనుంచి కొన్ని వందల పాటలు పుట్టినవి ప్రభువు మహా కృప చేత... నా కుటుంబములో ఒకేసారి 2 మరణములు సంభవించి కుటుంబీకులను కోల్పోయి గుండెపగిలిన ఆ స్థితిలో ఏ ఆధరణ సరిపోలేదు... మోకాళ్ళపై గుండె చింపుకొని ప్రభువు పాదాల చెంత నా గుండె బాధ పంచుకొనే వేళ మాటపలికి సృష్టిని చేసిన సర్వశక్తుని స్వరము నా చెవులలో ప్రతిధ్వనించింది. నేను నేనే నిన్ను ఆదరించు వాడను భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. గుండెచెదరిన వారిని ఆదరించు వాడను నేనే...గూడు చెదరిన పక్షులను చేరదీయు వాడను నేనే ... అని పలికిన ఆ మాటలు నేటికీ నాగుండె లోతుల్లో ముద్ర లాగా మిగిలి పోయినవి... ఆమాటలే నేను ఇప్పటివరకు బ్రతుకుటకు ఆధారం నా జీవిత కాలమంతటికీ సరిపోతాయి ఆ మాటలే... పరిశుద్ధాత్ముడు ఆ మాటల్ని పాటగా రాయించి, ఈ నోట పాడించాడు... ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడూ.. ప్రతీ పరిస్థితికి చాలిన ప్రభువు... ఒక చిన్న పరిస్థితిలో గూడు చెదరగొట్టి లోకానికి నాద్వారా ఇంత మంచిపాట అందించినావ్ కదా... అయితే ఇలాంటి పాటలు పుట్టడానికి ఎన్ని గాయాలైన నేను సిద్ధం ప్రభువా వాడుకో నీ మహిమ కొరకు ఈ చిన్న జీవితం... అని సజీవ యాగముగా సమర్పించుకున్నాను... నా ప్రాణాత్మ శరీరమును బలిపీఠము పై... నేటికీ 18 యేళ్లు గా ఆయన కృప నను వీడలేదు... దేవునికి స్తోత్రము... నన్ను ఆదుకున్న దేవుడు నిన్నూ చూస్తున్నాడు... ఆయనే సమర్థుడు... నీకైనా, నాకైనా, ఆయన కృప మాత్రము చాలు కదా!
ఇంకెందుకు కన్నీరు, ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు వేదన... హృదయ నిర్మాణకుడే దిగివచ్చి మన హృదయాల్లో నివసిస్తుంటే... !!!
ఆహా...!!! ఎంత ఈ భాగ్యము...!!! ధైర్యము తెచ్చుకో... గుండె నిబ్బరం చేసుకో.. నీకు కలుగు ప్రతీ పరీక్ష ఒకరోజు సాక్ష్యము గా మారుతుంది... పరీక్ష లేనిదే సాక్ష్యము లేదు...! నిబ్బరం కలిగి ధైర్యము గా ఉండుము... ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును బహుగా దీవించి, తనకు సాక్షులుగా ఫలింప చేయును గాక... ఆమెన్...
ఇట్లు..... ప్రభువు పాద సన్నిధిలో... మీ శ్రీ శైలము.
********************************************

జీవముగల దేవుని పరిశుద్ధ నామమునకు యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక... 2005 - 06. సంవత్సరంలో రికార్డింగ్ చేయబడి, క్యాసెట్ లో విడుదల చేయబడిన ఐదవ పాట, అనేకమైన చెదరిన గుండెలను ఆదరిస్తూ అనేకులను ఓదారుస్తూ, దేవుని నామమునకు మహిమ కరముగా నిలిచిన పాట... ఈ భాగ్యమిచ్చిన యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక... 2003 నుండి ప్రభువు ఇచ్చిన ఇంకా కొన్ని వందల పాటలు హృదయపు చెలిమల్లో ఊటలు గానే మిగిలి పోతున్నాయి... ప్రవహించు కాలువలుగా అనేక హృదయాలను చేరగలుగుటకు, దేవుని మహా కృప కొరకు మీ ప్రార్థన లో ఎత్తిపట్టండి... దేవునికి స్తోత్రము... దేవుడిచ్చిన ప్రతీ పాట దేవుని మహిమ కొరకు ప్రతిఒక్కరూ సొంతం చేసుకొని పాడుకోవటం ఈ భూమ్మీద ఉన్నప్పుడు చూడాలని నా ఆశ... హల్లెలూయ... ఇప్పటివరకు(18 ఏళ్ళల్లో) 27 పాటలు మాత్రమే రికార్డ్ చేయబడి విడుదల చేయబడినవి ఇంకా మిగిలి ఉన్న వందల పాటల విడుదలకు, నా జీవిత కాలం చాలునో, లేదో, అది దేవుని మహా కృప...* దయతో ప్రార్థించ గలరు... ఏదేమైనా నేనేమై యున్నానో అది కేవలం దేవుని కృప వలన మాత్రమే... ఆయన కృప నాకు చాలును... దయగల తండ్రీ ఇది నీ కృప, నీదయ మాత్రమే - యుగయుగములవరకు నీ నామము స్తుతి నొందదగినది. హల్లెలూయ.

show more

Share/Embed