లక్ష్మీ గౌరీ సంవాదం | శివతత్త్వం | Conversation between Lakshmi and Parvathi | Rajan PTSK
Ajagava Ajagava
139K subscribers
13,497 views
707

 Published On Jun 15, 2024

శివతత్త్వాన్ని తెలిపే లక్ష్మీ గౌరీ సంవాదం

అమృతం కోసమని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథించారు. అందులో నుండి హాలాహలం, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభమణి, పారిజాతమనే కల్పవృక్షం, అప్సరసలు, శ్రీమహాలక్ష్మి, సురకు అధిష్టానదేవతయైన వారుణి, ఆపై చివరిగా అమృతభాండంతో సహా ధన్వంతరి ఆవిర్భవించారు. వీటిలో అన్నిటికంటే ముందుపుట్టిన హాలాహలాన్ని పరమశివుడు భక్షించి లోకాలను రక్షిస్తే కామధేనువును మహర్షులు, ఉచ్చైశ్శ్రవాన్ని బలిచక్రవర్తి, ఐరావతాన్ని ఇంద్రుడు, కౌస్తుభమణిని విష్ణువు, కల్పవృక్షాన్ని, అప్సరసలను దేవతలు, వారుణిని రాక్షసులు తీసుకున్నారు. ధన్వంతరి ఆయుర్వేదాన్ని ప్రవర్తిల్ల జేసిన దేవ వైద్యుడు కాగా, అమృతాన్ని శ్రీమహావిష్ణువు జగన్మోహినిగా అవతారమెత్తి దేవతలకు పంచిపెట్టాడు. ఇక లోకపావని అయిన శ్రీమహాలక్ష్మి లోకపాలకుడైన శ్రీమహావిష్ణువును వివాహమాడి ఆయనకు దేవేరి అయ్యింది. ఆపై ఆ నవవధువు వైకుంఠానికి వెళ్లింది. కొత్తగా కాపురానికి వచ్చిన తన వదినగారిని చూడాలనుకుంది గౌరీదేవి. అనుకున్నదే తడవుగా బయలుదేరి పాలకడలికి వెళ్లింది. లక్ష్మీదేవి తన ఆడపడుచు అయిన గౌరీదేవికి ఎన్నో మర్యాదలు చేసి ఆదరించింది. ఆపై వారిద్దరూ పాలకడలి కెరటాలపై పరచిన వట్టుదుప్పటిపై కూర్చుని ఊయలలూగుతూ కబుర్లు చెప్పుకోసాగారు. లక్ష్మీదేవి తన ఆడపడుచు భర్త అయిన పరమశివుణ్ణి తన వివాహసమయంలో చూసింది. మహాతేజోవంతుడైన ఈ సత్పురుషుని వేషం ఇలా ఉందేమిటా అనుకుంది. ఆపై అతని గురించి వైకుంఠంలో తనవారిని ఆరాతీసి మరికొన్ని విషయాలు కూడా కనుక్కుంది. ఆయన మహాత్ముడనీ, యోగీశ్వరేశ్వరుడని, దేవతాసార్వభౌముడనీ ఇలా అందరూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారే కానీ, అసలా మహానుభావుడు అలా ఎందుకుంటాడన్న విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఈరోజు సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని సతీమణే స్వయంగా తనప్రక్కన కూర్చుంది కాబట్టి, ఆ విషయమేదో ఈవిడనే అడుగుదామనుకుంది. దానితో.. “గౌరీ! నేను నీ నాథుని గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా” అంది లక్ష్మీదేవి. తన భర్త పేరు చెబితేనే చాలు పులకించిపోతుందా జగన్మాత. ఇక ఆయన గురించి అడిగితే చెప్పనంటుందా! “ఓ అడుగు లక్ష్మీ, చెబుతాను” అంది సంతోషంగా. ఆ వదినామరదళ్ళిద్దరూ ఒకరు వయసులోను, ఇంకొకరు వరసలోను పెద్ద కాబట్టి వారిమధ్య ప్రేమనిండిన మాటలే తప్ప మీరు మీరు అనే మన్నింపు సంబోధనలు లేవు. ఇక వారి సంవాదం ఇలా మొదలయ్యింది. లక్ష్మీదేవి అందమైన తన చుబుకం క్రింద చేయిపెట్టుకుని ఆశ్చర్యం నిండిన కళ్ళతో ఇలా అడగసాగింది.

show more

Share/Embed