NAKEMI KODUVA||నాకేమి కొదువ || CHRISTIAN SONG || ANDHRA CHRISTIAN HYMNAL || # 14 SONG
DMK U C DMK U C
1.58K subscribers
22,470 views
234

 Published On Mar 8, 2020

నాకేమి కొదువ - నాథుడుండ ఇక 

      శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠపాలకుడు - 

      నా యేక రక్షకుడు


1.    ఎన్నికైన - ఎండనట్టి = సన్న పచ్చిక 

      విం తరుగని - సదుపాయంబుల్‌ - 

      నా - కెన్నో చేయున్‌ గనుక


2.   తనివి తీరన్‌ మే - ళ్ళనుభవింప = 

      నను సదా మేళ్ళనెడి పచ్చిక -

      నదిమి మృదువుగ - పండు - 

      కొన జేయును గనుక


3.   ఎంత శోధన - యెండయున్న = 

     ఎంతకు న్నోరిగర దెపుడు - శాంత

     జలములు - నా - చెంతనే యుండున్‌ గనుక


4.   తప్పిపోయిన నన్‌ - దారింబెట్టి - 

      తెప్పరిల్ల చేసి నాకు - తీర్చు నలసటను - 

      నా - తప్పు మన్నించున్‌ గనుక


5.   నీతి మార్గమునన్‌- నిల్పును నన్ను = 

     నీతి లేని నాకు తన సు - నీతి దయచేయున్‌ - 

      స్వ - నీతిన్‌ ద్రుంచున్‌ గనుక


6.   చావు చీకట్ల - శక్తియుండు = 

     లోయలో బడి పోవలసినను - నే వెరువకుండ - 

     నా - దేవుడే తోడు గనుక


7.  కష్టంబులను చీ - కటి లోయలో = 

     స్పష్టముగ ఘన సౌఖ్యమును నా -  దృష్టికింజూపి - 

    నా - నష్టముల్‌ దీర్చున్‌ గనుక


8.    మీద పడునట్టి  - శోధనలన్‌ = 

       నా దరికి రానీక దండము - నన్ను

       లాగుచును - నా - కాదరణయౌను గనుక


9.    పగవారల్‌ సిగ్గు - పడునట్లుగ = 

      జగతి యెరుగని సౌఖ్యభోజన - మగు పరచుచున్‌ - 

      హా - తగినదే పెట్టున్‌ గనుక


10.  తన యాత్మానంద - తైలంబుతో = 

      అనుదినము తలయిం విసుగు -  కొనక తుడుచును - 

      నా - కను నీళ్ళన్నీ గనుక


11.  పలు విధములైన - భాగ్యములతో = 

     వెలుపలికి దిగ వెడలున్టి - వెలగల  గిన్నె - 

     నా - కలిమిగా జేయున్‌ గనుక


12.  బ్రతుకంతటన్‌ - కృ- పా క్షేమముల్‌ = 

      వదలకుండగ వచ్చు నాతో - సుదినములు గల్గు - 

      నా - పదలు సంపదలౌ గనుక


13.  దురితంబులుండు - ధరణి నాకు = 

      ఇరవు కాదిక నెప్పికినా - పరమ దేవుని - 

      మం - దిరమె నా యిల్లు గనుక


14.  కావలసిన వెల్ల - కనబడగలవు = 

      ఏవి యడిగిన - వాని నిచ్చి వేయును తండ్రి - ఇచ్చి


 15. ధన సహాయంబు - మనకు గల్గు = 

      అనుదినంబు - తండ్రి మనకు

      అక్కరలు తీర్చు - మన


16.  ప్రభువు దూతలును - పరిశుద్ధులున్‌ 

     విభవముగ మన మధ్య- మసలుచు 

     వెలుగు చుందురుగా - హా


17.  జనకుని ఇష్ట జనము వచ్చు - 

       తనకు యిష్టము గాని జనమును - 

       దరికి రానీయడు - ఈ


18.  మా మిత్రులైన - మహిమ దూతలే 

      క్షేమమునకై మా చుట్టు - చేరి  కాయుదురు - చుట్టు


19. అందరు మేళ్ళు - అనుభవింప = 

     విందుగా సమకూడు వార్తలు - విని పించును - తండ్రి


20. ప్రభుని శరీర - రక్తములు = 

     ఉభయ జీవితములకు మేలై- ఉండును నాకు - మేలై


21. నైజ పాపములు - నశియించుటకే = 

     భోజనము వడ్డించును -  రాజే స్వయముగా - దేవ


22. నీ మనసులోనివి - నెరవేరును = 

     క్షేమము గనే ఉండవలయు - చింత లేకుండ - నీవు


23. నాకు నా తండ్రి - నర రూపముతో = 

     త్రైకుని రీతిగా కనబడి -   ధైర్య మిచ్చును - నాకు



24. జనక సుతాత్మ - లను దేవుడు = 

     ఘనముగా యుగ యుగములన్నిట - 

     వినుతు లొందును - నేనా - యన గొర్రెనే గనుక

show more

Share/Embed