బ్రహ్మంగారి చరిత్ర - 21వ భాగం (చరిత్ర, కాలజ్ఞానం) || Brahmamgari Charithra || My3
My3 Media My3 Media
6.1K subscribers
53 views
3

 Published On Sep 28, 2024

#kalagnanamfacts #kalagnanambrahmamgaru #kalagnanam
#brahmamgarufamily
#brahmamgaru
#brahmamgariaardhana
#brahmamagaricharithra
#brahmamagarikaalagnyanam
#veerabrahmam
#kalagnanamfacts
#kalagnanambrahmamgaru
#kalagnanam

బ్రహ్మంగారి చరిత్ర - 21 వ భాగం
--------------------------------------

భారతీయ నొస్త్రాడమస్ గా, భవిష్య జ్ఞానిగా, కాలజ్ఞాన కర్తగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మం గారి స్వయం విరచిత కాలజ్ఞాన ప్రవచనం ఒక నదీ ప్రవాహంలా సాగుతోంది. బిడ్డలారా! రాబోయే కాలంలో మనుషుల పాపాలు అనంతంగా పెరిగిపోయి, సృష్టి వినాశనం, ప్రకృతి విధ్వంసం నిరాటంకంగా సాగిపోయి మహా ప్రళయానికి దారి తీస్తుంది. ఈరోజు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పిల్లా పాపలతో సవ్యంగా సాగుతున్న మానవ జీవితం రానున్న రోజుల్లో నరక ప్రాయంగా మారుతుంది. ఆంధ్రా ప్రాంతానికి వరదాయినిగా పరుగులు తీస్తున్న కృష్ణమ్మ బెజవాడ దగ్గర ఉగ్రరూపం దాలుస్తుంది. తాటి ప్రమాణంలో నింగి కేగిసే మహోగ్ర కృష్ణా ప్రవాహం బెజవాడ కనక దుర్గమ్మ ముక్కు పుడుకను తాకి సమస్త తీర ప్రాంతాలను జలమయం చేస్తుంది. అందువల్ల చెప్పలేనంత ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం జరుగుతుంది. అది మహా ప్రళయానికి, మహా విధ్వంసానికి తార్కాణం. నేను వీర భోగ వసంత రాయుడనై వచ్చేనాటికి ఈ భూమిపై అనేక వింతలు, విశేషాలు, ఉత్పాతాలు, విధ్వంసాలు, వినాశనాలు జరుగుతాయి. నేను ఈరోజు నీటితో దీపాలు వెలిగించినట్లె భవిష్యత్తులో మానవుడు కూడా నీటితో విద్యుత్ ను ఉత్పత్తి చేసి, దాని వల్ల దీపాలు వెలిగించడమే కాకుండా చోదకుడు లేకుండా వాహనాలను కూడా నడిపిస్తాడు. విద్యుత్ వల్ల ప్రపంచంలో గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి సంభవిస్తుంది. కాశీ పుణ్య క్షేత్రంలో గంగా నది అడుగంటి పోయి అక్కడి దేవతా మూర్తులు ప్రజలతో మాట్లాడతాయి. మహాలక్ష్మీ మాత గుళ్ళు, గోపురాలు విడిచిపెట్టి అంతర్ధాన మవుతుంది. ప్రజలు గోడు గోడున విలపిస్తారు. రాజ మందిరాలలో రాజులు, పండితుల పూజలు అందుకున్న సరస్వతిని అంగళ్లలో విక్రయిస్తారు. ముచికుందా నది( ఇప్పటి మూసీ) పొంగి హైదారాబాద్ నగరాన్ని ముంచెత్తుతుంది. అందువల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. తిరిగి పునర్ వైభవం పొందే హైదారాబాద్ నగరం ఎటు చూసినా శత యోజనాల మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. గోదావరి అనేక తీర ప్రాంతాలను లయం చేసుకుంటూ జల ప్రళయం సృష్టిస్తుంది. అద్దంకిలో నాంచారి మనుష్యులతో మాట్లాడుతుంది. కావేరీ నది మహోగ్ర రూపం దాల్చి వందలాది మందిని లయం చేసుకుంటుంది. శ్రీరంగ నాయకుని గుడిలో నుంచి మాటలు వినబడి గుండెలు పగిలి కొందరు ప్రాణాలు విడుస్తారు. బ్రహ్మ జ్ఞానం కలిగి, తమ్ము తామెరిగిన రాజ యోగులకు నా దర్శనం లభిస్తుంది. నాయుడు పేటలో సంపద నశిస్తుంది. ముత్యమంత బంగారం కూడా లభ్యం కాదు. పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. అందువల్ల భీతి చెంది కొన్ని గ్రామాల ప్రజలు నశిస్తారు. మింటి నుంచి అనేక నక్షత్రాలు పటాలున పేలిపోయి కుప్పలు కుప్పలుగా నేల రాలుతాయి. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింత రంగుల, విచిత్ర ఆకారంలో చుక్కలు పుట్టి, అయిదు నెలల పాటు ఆరిపోకుండా అలాగే ప్రకాశిస్తాయి. కర్నాటక దేశంలోని కొన్ని దేవాలయాలలో శ్రీలక్ష్మీ విగ్రహాలు కళ్ళు తెరచి నిప్పులు చిమ్ముతాయి. గతంలో చక్రవర్తులు, మహా రాజులు, జమీందారులు భూమిలో పాతి పెట్టిన నిక్షిప్త నిధులను పరాయి రాజులు దోచుకు పోతారు. మళయాల మందలి మంద పాలుడు మానవులతో మాట్లాడుతాడు. తిరుపతి మార్గం పూర్తిగా మూసుకు పోతుంది. దానివల్ల భక్తులు గుండెలు బాదుకుని విలపిస్తూ పరుగులు తీస్తారు. ప్రకృతి విపత్తులతో భూమి కన్పిస్తుంది.అపార ప్రాణ నష్టం సంభవిస్తుంది. భూమి రక్తంతో తడిసి ముద్దవుతుంది. ఎముకల పోగులు గుట్టల వలె పెరిగిపోయి, భరించ నలవిగాని దుర్గంధంతో జనం పిచ్చి వారి వలె ప్రవర్తిస్తారు. దుష్ట గ్రహాలు విజృంభించి ప్రజలు హాహాకారాలు చేస్తారు. కాకులు వికారంగా అరుస్తాయి. నక్కలు భీకరంగా కూతలు పెడతాయి. కొండవీటి రాతి గరుడ స్థంభం కూలి కొందరు మరణిస్తారు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత కాశీలో గంగానది పూర్తిగా ఎండి పోయి అదృష్యమవుతుంది. కంచి కామాక్షి ఒక ఝాము పాటు గిర గిరా తిరుగుతుంది. బెంగుళూరు కామాక్షి తల్లి నోట రక్తం కనపడుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. కుక్కలు గుర్రాలను తరిమి తరిమి, కరచి చంపుతాయి. చెన్న కేశవుని మహిమలు సన్నగిల్లి పోతాయి. శ్రీశైల దక్షిణ భాగాన గాలి వానల వల్ల గుండ్లు దొర్లి, రక్తధారలు నేలను తడుపుతాయి. రాళ్ళు పగిలి రక్తం, చీములు స్రవిస్తాయి. ముక్కు పచ్చలారని పసి బిడ్డలు అనర్గళంగా మాట్లాడుతారు.ఆకాశంలో మంటలు పుట్టి ఆరు మతాలు ఒక్కటవుతాయి. అర్థ రాత్రి వేళ భీతావహంగా ఘంటారావం, శంఖధ్వని వినపడుతాయి. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది. వావి వరుసలు నశిస్తాయి. పుణ్యాత్ములు కళ్ళల్లో దీపపు వత్తులు పెట్టుకొని నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. తిరుపతి లో వేంకటేశ్వరుని సొమ్ము కాజేస్తారు. పూజలు లేక దేవాలయాలు పాడుపడి పోతాయి. పుణ్య స్థకాలలో ఆరుగురు దుష్టులు పుట్టి సమాజంలో ఘోరకలిని సృష్టిస్తారు. కృష్ణా గోదావరి నదుల మధ్య జనులు గుంపులు గుంపులుగా మరణిస్తారు. శీత జ్వరాలు పుట్టి కొల్లలుగా జనులు నశిస్తారు. కృష్ణా నది మధ్య బంగారు రథం కనిపిస్తుంది. దానిని చూసినవారు గుడ్డి వారవుతారు. రాతి రథాలు విరిగి పడతాయి. దేవ బ్రాహ్మణులు ఆచార శూన్యులై కటిక దరిద్రు లవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో రెండు తలల బంగారు మొసలి కనబడి క్షణాల్లో అమ్మవారిలో లీనమవుతుంది. రెండు బంగారు హంసలు ఆలయాల నుంచి వచ్చి అట్టణాల మీద, వనాల మీద స్వేచ్చగా విహరిస్తాయి. వాటిని పట్టుకోడానికి బయలు దేరిన పాపాత్ములు కొందరు అంధులై కుమిలిపోతారు. నేను వీరభోగవసంత రాయుడినై వచ్చే నాటికి ప్రపంచంలో అనేక వింతలు, ఉత్పాతాలు జరుగుతాయి. నన్ను నమ్మి కొలిచేవారు, నిరంతరం కాలజ్ఞానం పఠించే వారు మాత్రం నిర్భయంగా, నిశ్చింతగా వుంటారు." అని బ్రహ్మం గారు ఆనాటికి కాలజ్ఞాన ప్రవచనం ముగించారు.

show more

Share/Embed