ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు || VEMANA SHATHAKAM || ప్రజాకవి వేమన శతకం || My3
My3 Media My3 Media
6.11K subscribers
591 views
18

 Published On Sep 27, 2024

#vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam#vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam #vemana #vemanapadyalu #vemanapadyaalu #my3 #my3media #ancientpoet #socialreformer #prajakavi #popularpoetry #padhyam119 #my3media

పద్యం - 119
------------------------
ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు
వెఱ్ఱి మనుజుడెల్ల వెదకు శివుని
ఇంద్రియముల రోసి ఈశుని జూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!

మిత్రులారా!

ఓ మనిషీ! నిలువెల్లా కోర్కెలు దహిస్తుంటే.. ఇంద్రియలోలుడవై, వ్యసనపరుడవై సంచరిస్తూ.. మరో పక్క పరమ శివుని కోసం ఆరాట పడతావు? ఆయనను దర్శించాలని వేగిర పడతావు. అదెలా సాధ్యం? అంటూ మనిషిలోని ద్వైదీ భావాన్ని ఈ పద్యంలో ఎండ గడతాడు వేమన. వ్యసనాలు, కోర్కెలు, కాంక్షలు వేరు, భగవంతుని చేరే నిష్కామ కర్మ, సన్యాసం వేరు. ఇవి పరస్పర విరుద్ధ భావనలు. ఒకటి పొందాలంటే ఒకటి త్యాగం చెయ్యాలి. భగవంతున్ని చేరాలంటే కోర్కెలను జయించాలి. సర్వస్వం విడిచి పెట్టాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఎలా సాధ్యం? అని వేమన ఈ పద్యంలో చమత్కరిస్తున్నాడు.

"ఇంద్రియముల చేత నెగ్గొందు చుండెడు
వెఱ్ఱి మనుజుడెల్ల వెదకు శివుని
ఇంద్రియముల రోసి ఈశుని జూడరా!
విశ్వదాభిరామ వినురవేమ!"

నిలువెల్లా కోర్కెలు కలిగి, ఇంద్రియాలను అదుపులో పెట్టలేని మనుషులు తమకు పరమ శివుడు కనిపించడం లేదని, శివుని దర్శనం కావాలని ఆవేదన చెందుతుంటారు. దేవుని కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారంతా పిచ్చివాళ్ళు, మూర్ఖులు అంటాడు వేమన. భగవద్దర్శనం కావాలంటే ముందుగా కోర్కెలను చంపుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని విరక్తి మార్గంలో పయనించాలని జన కవి సలహా ఇస్తున్నాడు. అంతిమంగా చెప్పేదేమంటే భక్తి మార్గంతో అనురక్తి మార్గం ఎప్పుడూ కలవదని, దైవాన్ని చేరే దారికి అడ్డుదారులు వుండవని వేమన చెబుతున్నాడు.

ధన్యవాదాలు!
******
ప్రతి రోజూ ఒక పద్యం
మీ పిల్లల కోసం..

show more

Share/Embed