Junior Doctors in Kolkata ‘Fast-Unto-Death’ Demanding Justice For R.G. Kar Medic
ETV Andhra Pradesh ETV Andhra Pradesh
7.04M subscribers
915 views
9

 Published On Oct 9, 2024

కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని..జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష 5వ రోజుకు చేరింది. నేడు దుర్గామాత మండపాల వద్ద....బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ కరపత్రాలను పంచారు. రక్తదాన శిబిరాలను జూనియర్ డాక్టర్లు నిర్వహించారు. హత్యాచారానికి గురైన తమ సహోద్యోగికి న్యాయం చేయాలన్న జూనియర్ వైద్యులు...ఆరోగ్యశాఖ కార్యదర్శి NS నిగమ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆస్పత్రులు, వైద్యకళాశాలలకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ కోసం ఆస్పత్రుల్లో మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని..వైద్యశాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా మంగళవారం...ఆర్ జీ కర్ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కొందరు సీనియర్ వైద్యులు నగరంలో రెండు ర్యాలీలు నిర్వహించారు. ఆగస్టు 9న వెలుగుచూసిన ఈ ఘటనపై దాదాపు నెల రోజులు విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు...ఆందోళన చేశారు. వారి డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం మమతా బెనర్జీ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లు పరిష్కరించడం లేదన్న జూనియర్ డాక్టర్లు ఈనెల 5 నుంచి మరోసారి సమ్మెకు దిగారు

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

show more

Share/Embed