వారములకు ఆ పేర్లు, ఆ వరుస ఎలా వచ్చాయి? | Reason Behind the Names and Order of the Days of the Week
Ajagava Ajagava
136K subscribers
20,003 views
1.3K

 Published On Sep 21, 2024

ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇవీ మనం పిలుచుకునే వారాల పేర్లు. ఈ వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో, అసలు వారానికి ఏడు రోజులే ఎందుకో? అవి కూడా ఆది నుండి శనివారం వరకూ అదే వరుసలో ఎందుకు ఉంటాయో? మొదలైన విషయాలను ఈరోజు మనం మన అజగవలో చెప్పుకుందాం.

మనకు మొత్తం తొమ్మిది గ్రహాలున్నాయి. వాటిలో రాహుకేతువులను ఛాయాగ్రహాలు అంటారు. వాటిని తీసేస్తే ప్రధాన గ్రహాలు ఏడు. గ్రహము అన్న మాటకు గ్రహించునది, పట్టునది అని ఒక అర్థం. అంటే మనపై ప్రభావం చూపించేవి కనుక అవి గ్రహములు. ఆ అర్థంలోనే మన ప్రాచీన విజ్ఞానవేత్తలు సూర్యుణ్ణి కూడా ఒక గ్రహంగా పేర్కొన్నారు. మనం మన విశ్వంలో ఉన్న గ్రహాల కదలికలను, అవి మనపై చూపించే ప్రభావాలను భూమిపై ఉండే లెక్క వేస్తాం కనుక.. ఈ లెక్కలన్నింటికీ భూమినే కేంద్రకంగా తీసుకోవాలి. అలా భూమిని కేంద్రకంగా తీసుకుని ఆ ఏడు గ్రహాలను పరిశీలించినప్పుడు, అవి తిరిగే వేగాన్ని బట్టి, భూమి నుండి వాటి దూరాన్ని బట్టి, అవి భూమిపై చూపించే ప్రభావాన్ని బట్టి, వాటికి ఒక వరుసను లెక్క కట్టారు మన మహర్షులు.

Rajan PTSK

show more

Share/Embed