శ్రీ జగన్నాధుని రధయాత్రకు అందరూ ఆహ్వానితులే
vizagwebnews vizagwebnews
7.15K subscribers
53 views
0

 Published On Jul 4, 2024

శ్రీ జగన్నాధుని రధయాత్రకు అందరూ ఆహ్వానితులే శ్రీ జగన్నాథ స్వామి కళ్యాణ రథ యాత్ర ఉత్సవాలు ఈ నెల 6 వ తేదీ నుంచి జరుగుతాయి అని దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.రాజ గోపాల రెడ్డి తెలిపారు. టౌన్ కొత్త రోడ్డు వద్ద గల శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 7 న సాయంత్రం 4.15 గంటలకు తొలి రథ యాత్ర ఎమ్మేల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చే ప్రారంభోత్సవం జరిగి, టౌన్ కొత్త రోడ్డు నుంచి మొదలవుతుంది అన్నారు. ఉత్సవాలకు రోజుకి 15 వెలు నుంచి 20 వేల వరకు భక్తులు వస్తారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సూచనలు మేరకు ఉత్సవాలు జరుగుతాయి. టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఉచిత, రూ.20, రూ .50, రూ.200, దర్శనాలు వుంటాయి. రోజూ సాయంత్రం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. భక్తులకు మంచి నీ రు, బిస్కట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈనెల 25 న
మహా అన్న దానం నాలుగు వేల మంది కి జరుగుతుంది. ఉత్సవాలకు మొత్తం 2.5 లక్షల మంది వస్తారు. ఉత్సవాలకు బడ్జెట్ రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. ఈనెల 8 నుంచి దశావతారాలు వుంటాయి. ఈ నెల 8 న స్వామి వారు మత్స్య, 9 న కూర్మావతారం, 10 న వరాహావతారం, 11 న నృసింహవతారం, 13 న వామనావతారం, 14 న పరసురామావతారం, 15 న రామావతారం, 16 న కృష్ణావతారం, 17 న శేష పాన్పు అవతారాలు వుంటాయి అన్నారు. మూడు దేవస్థానాలు సింహాచలం, కూర్మనాథ, రామతీర్థం నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. గత ఏడాది రూ.63 లక్షల ఆదాయం వచ్చింది. ప్రధాన అర్చకుడు పీ.జగన్నాథాచార్యులు మాట్లాడుతూ, ఇది అతి పురాతన దేవస్థానం. ఈనెల న స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. దేశంలో పూరీ తరువాత అత్యంత వైభవంగా 1862 నుంచి సుమారుగా గత 200 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు
ధ్వజ రోహన తో ఉత్సవాలు ప్రారంభం. అరుణ నేత్రోత్సవం
7 న మధ్యాహ్నం 3 వరకు రథం మీద నుంచి దర్శనాలు వుంటాయి. 8 నుంచి 17 వరకు దశావతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. 18 న తిరుగు రథ యాత్ర ఉత్సవాలు జరుగుతాయి అన్నారు. మీడియా సమావేశంలో అనంత స్వామి, రంగాణాధాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.#vizagwebnews

show more

Share/Embed