Profitable Farming || వ్యయం వేలల్లో - ఆదాయం లక్షల్లో || Mittapalli Ramulu || 6300955362
Raitu Nestham Raitu Nestham
1.25M subscribers
74,292 views
1.5K

 Published On Jan 6, 2021

#Raitunestham #Agriculture

నేలల సంరక్షణ.. !! వినియోగదారుడి ఆరోగ్యానికి రక్షణ !! రైతు శ్రమకి తగిన ఆదాయం !! ఈ మూడింటి మిలితంగా సాగే ఉత్తమ వ్యవసాయ విధానమే... ప్రకృతి సేద్యం !! ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ.. రాబడి ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు సహజ సాగులో పంటలు పండిస్తున్నారు. మంచి లాభాలతో పాటు వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. వారిలో ఒకరు.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రాములు. ఎలాంటి రసాయనాలు వాడకుండా 12 ఎకరాల్లో మామిడి, మరో 2 ఎకరాల్లో వరి, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ... కొనుగోలుదారులని తన దగ్గరికే రప్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయం పొందుతున్న ఈ ప్రకృతి రైతు.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. సాగులో ఉత్తమ విధానాలు పాటిస్తు.. తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్న మిట్టపల్లి రాములు కృషికి గుర్తింపుగా.. రైతునేస్తం 2020 పురస్కారాలలో ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.

The success story of natural farmer Mittapalli Ramulu of Thungur village, Beerpur Mandal, Jagityal district of Telangana State. The best farming practices of Ramulu bringing buyers to his field, offering better prices to the crop.

Music Track
bensound-dreams
bensound-happiness
www.bensound.com

show more

Share/Embed