అనంతపురం నుండి గుంటూరు కు నేరుగా చేరుకునేలా హైవే నిర్మాణం
Megha Engineering and Infrastructures Ltd Megha Engineering and Infrastructures Ltd
74.7K subscribers
201,578 views
961

 Published On Oct 17, 2023

#anantapur #guntur #highway #nh544d

అనంతపురం నుండి గుంటూరు కు నేరుగా చేరుకునేలా హైవే నిర్మాణం

అనంతపురం నుండి నేరుగా గుంటూరు చేరుకునేలా రోడ్డు నిర్మాణం జరుగుతుంది తెలుసా? ఈ రెండు నగరాల మధ్యన సులభతర ప్రయాణానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు వరుసల రహాదారిగా అభివృద్ది చేస్తూ 544డి నెంబర్ కేటాయించారు.

ఈ రెండు నగారాల మధ్యన ఉన్న దాదాపు 418 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడంతో పాటు,ప్రయాణ సమయాన్ని సైతం తగ్గించి మెరుగైన రవాణాకు వీలుగా ఈరోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారు.

ఈ జాతీయ రహాదారి పనుల్లో భాగంగా అనంతపురం జిల్లా ముచ్చుకోట నుండి తాడిపత్రి మీదుగా బుగ్గ వరకు దాదాపు 32 కిలోమీటర్ల పొడవున నాలుగు వరుసల రహాదారి నిర్మాణ పనులను హైబ్రిడ్ యాన్యుటీ పద్దతిలో చేపట్టింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద.ఈ పనుల్లో భాగంగా రైల్ ఓవర్ బ్రిడ్జి-1, మేజర్ బ్రిడ్జిలు-2, మైనర్ బ్రిడ్జిలు-11,వెహికల్ అండర్పాస్లు-10, లైట్ వెహికల్ అండర్ పాస్లు-2, బాక్స్ కల్వర్టులు 31 నిర్మిస్తుంది ఎం ఈ ఐ ఎల్.

ఈ హైవే నిర్మాణం పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని కీలకమైన అనంతపురం నుండి తాడిపత్రి, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, వినుకొండ,నరసారావుపేట మీదుగా గుంటూరు నగరం అక్కడి నుండి విజయవాడ వరకు సులభంగా చేరుకోవచ్చు. సరుకు రవాణాకు,మెరుగైన ప్రయాణానికి ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Megha Engineering & Infrastructures Limited (MEIL) is a major infrastructure company headquartered in Hyderabad, India. The company was established in 1989 as a small fabrication unit. In due course of time, the unit made a name for itself. We are fired by the zeal to equip the country with an engineering and infrastructure foundation that can hold up its pillars for generations to come.

show more

Share/Embed