దేవా నా దేవా|| Deva Naa Deva || ದೇವಾ ನಾ ದೇವಾ || தேவா நா தேவா || ദേവ നാ ദേവ || देवा ना देवा ||
LSMHYD OFFICIAL LSMHYD OFFICIAL
890 subscribers
530 views
60

 Published On May 29, 2024

దేవా నా సృష్టి కర్త- దేవా నా రక్షణ కర్త
ఈ ధినుడి మోర వినవా - నా స్వరము వినుమా
నా ఆత్మ గానం వినవా- నా దీన స్థితిని కనుమా

దేవా నా దేవా.... దేవా నా దేవా.... దేవా నా దేవా.... దేవా నా దేవా....
|| దేవా||
I
నాపై జనులు వ్యర్ధముగ నిందలు వేయగా - నా న్యాయాధిపతి నీవే అనుకున్నా
నాపై అపవాధి తాంత్రిక క్రియలు ధ్వేషముతో చేయగా - నా రక్షణాధిపతి నీవే అనుకున్నా
నా ఇంటివారు నను వెలివేసి నాకు దూరంకాగా - నా బంధం నీవే అనుకున్నా
నా ఆత్మీయులే నాపై స్వార్ధముతో నన్ను వంచింపగా - నా అనుబంధం నీవే అనుకున్నా
|| దేవా||
II
నాకు కలిమి దూరంకాగా నేను చింతించకా- నా ధననిధి నీవే అనుకున్నా
నా ఆరోగ్యం క్షిణించి పోగా నేను బయపడకా – నా స్వస్థత నీవే అనుకున్నా
నా సర్వస్వాన్ని కోల్పోయి న స్థితిలో నేను పడియుండగా – నా ఆశ్రయము నీవే అనుకున్నా
ఇహలోక పయనాన్ని ఒంటరినై నేను సాగుతూ ఉండగా - నా పయనం నీతో అనుకున్నా || దేవా||
III
నీవు ఇచ్చిన ఈ పరిచర్యను స్వార్ధ ప్రియులు పాడు చేయగా - నా కాపరి నీవై తోడుండగా
నీవు ఇచ్చిన ఆలయమును స్వార్ధ పరులు కీడు చేయగా - నా ఆశ్రయపురము నీవైయున్నావు
నా విశ్వాసమును కాపాడుకొని హృదిలో చేరాలని- నా ఆత్మీయ గమ్యం నీవేనని
ప్రాణాత్మ దేహమును నీకు అర్పించి - నా పరుగు తుదముట్టించి నిన్ను చేరాలని
|| దేవా||

show more

Share/Embed