Podili Famous Narasamma Gari Ragi Sangati Natu Kodikura | Traditional Food| Chicken Curry| Food Book
Food Book Food Book
160K subscribers
22,989 views
578

 Published On Oct 13, 2024

చిరునామా:- పొదిలి నుండి కనిగిరి కు పోయే రహదారి లో పెదారికట్ల గ్రామం దాటిన తర్వాత నరసమ్మ గారి రాగి సంగటి హోటల్ ఉంటుంది.

దంపతులకు భిన్న భావనలున్న పరస్పర గౌరవంతో ఆచరణ ఏకీకృతమవుతుంది. తద్వారా దాంపత్య జీవితం ఆనందమయమై బాంధవ్యం ద్విగుణీకృతమవుతుంది.

అంతరాలు లేకుండా సమభావంతో అపురూప బంధాన్ని సార్ధకం చేసుకుంటున్న వారెందరో సమాజంలో.అట్టి అన్యోన్య దంపతులైన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెద అరికట్లకు చెందిన నరసమ్మ,వెంకటేశ్వర్లు గార్లను మీకు పరిచయం చేయబోతున్నాను.

నరసమ్మ గారికి చిన్ననాటి నుండి చలనచిత్రాల పట్ల మక్కువ.ఎప్పటికైనా ఓ చిత్రాన్ని నిర్మించాలన్నది ఆకాంక్ష.కాయకష్టం చేసి వచ్చిన సంపాదన కుటుంబ అవసరాలకు వినియోగించగా కొంత దాచారు చలనచిత్రం నిర్మించాలన్న లక్ష్యంతో.ఓ రోజున దంపతులరివిరు పుట్టింటికి రా చెల్లి చిత్రాన్ని చూసి ఇంటికి వచ్చి దరిమిలా తమ అను కాంక్షను వెంకటేశ్వర్లు గారితో పంచుకున్నారు నర్సమ్మగారు.చిత్రాలు నిర్మించే స్థాయి మనది కాదని
తొలుత వద్దని వారించిన వెంకటేశ్వర్లు గారు
నరసమ్మ గారి సంకల్పాన్ని గమనించి తదనంతరం ఒప్పుకుని స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పేరుతో చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని కథను అందించింది నరసమ్మ గారే విద్యాభ్యాసం లేకున్నను వారికి ఉన్న సామాజిక దృక్పథం మాతంగి వ్యవస్థ ఇతివృత్తంగా కథను సిద్ధం చేసింది.

ఈ పరంపరలో అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ఏమాత్రం వెనకడుగు వేయని వెంకటేశ్వర్లు గారు నరసమ్మ గారికి మరింత ప్రోత్సాహం అందించి వారి ఆకాంక్షను నెరవేర్చబోతున్నారు.

పెదారికట్ల లో ఉన్న వారి ఆహారం గురించి నిర్మించిన చలన చిత్రం గురించి వారి మాటల్లో విందాం

గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

show more

Share/Embed