డా జయగోపాల్ అంతిమయాత్ర
BV MOURYA CREATION BV MOURYA CREATION
21.8K subscribers
23 views
4

 Published On Feb 8, 2024

సాంస్కృతిక ఉద్యమకారుడు డాక్టర్ జయ గోపాల్ గారికి జోహార్లు
తేది:07/02/2024,

ఆధునిక ఆంధ్ర పెరియార్ డాక్టర్ జయ గోపాల్ గారు ఈరోజు తేదీ 7.2.2024 బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు తన తుది శ్వాస విడిచారు.
1972వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున భారత నాస్తిక సమాజం అనే సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లో నాస్తిక ఉద్యమ వ్యాప్తి కోసం కృషిచేసి అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల కార్యకర్తలను అండగా నిలబడుతూ పోరాటం చేశారు.52 సంవత్సరాలుగా భారత నాస్తిక సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల మత మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ దళితులపైన దాడులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్మించిన ఘనత డాక్టర్ జయ గోపాల్ గారిది. సాంస్కృతిక ఉద్యమాల నిర్మాణం ద్వారానే సమాజంలో మార్పు కోసం తన జీవితకాలం కృషి చేసిన వారు డాక్టర్ జయ గోపాల్. అంతర్జాతీయ బ్రేవ్ మైండ్ అవార్డును సైతం అందుకున్న మహనీయుడు డాక్టర్ జయ గోపాల్. సాంస్కృతిక ఉద్యమ నిర్మాణం కోసం భౌతిక వాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎన్నో రచనలు చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తన తుది శ్వాస విడిచారు డాక్టర్ జయ గోపాల్ గారి మృతి నాస్తిక హేతువాద మానవతా ఉద్యమాలకు తీరని లోటు.
ఆయన అంత్యక్రియలు రేపు 08-02-2024 విశాఖపట్నంలోని అరిలోవకలనిలో జరుగును
జోహార్ డాక్టర్ జయ గోపాల్
లాంగ్ లివ్ డాక్టర్ జయ గోపాల్

బాన్సువాడ వేదాంత్ మౌర్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్

show more

Share/Embed