07. అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా - భలే మంచి రోజు -(Tribute to Ghantasala - ఘంటసాల శత జయంతి)
 Malgudi Malgudi
1.9K subscribers
63,616 views
488

 Published On Dec 10, 2022

భలే మంచిరోజు (Tribiute to Ghantasala)

07. అత్త లేని కోడలు ఉత్తమురాలు (దంపుడు పాటగా ప్రసిద్ది పొందిన ఓ ప్రైవేటు గీతం)
(అమర గాయకుడు ఘంటసాల వారి శత జయంతి వేడుకల సందర్భంగా శతాధిక గీత నివాళి)

అమర గాయకుడు ఘంటసాల శత జయంతిని పురస్కరించుకుని శతాధిక గీత సమర్పణలో భాగంగా ఏడవ గీతంగా నేడు మన ముందుకొస్తోన్న “అత్త లేని కోడలుత్తమురాలు” అన్న ఈ పాట దంపుడు పాటగా ప్రసిద్ది పొందిన ఓ ప్రైవేటు గీతం..

అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలే లేని అత్త గుణవంతురాలు అన్నది ఓ చిలిపి సామెత.. ఆ సామెతనే ప్రేరణగా తీసుకుని ఎంతో చిలిగా అల్లిన గీతమిది.. దంపుడు పాటగా కూడా ప్రసిద్ది పొందిన పల్లె గీతం.. మూల రచయిత.. స్వరాలు అద్దిన వారు ఇదమిద్దంగా తెలీనప్పటికీ ఘంటసాల సంగీత సారధ్యంలో వచ్చిన మన దేశం (1949) అన్న చిత్రంలో ఈ గీతాన్ని వాడటం జరిగింది.. సముద్రాల సీనియర్ పేరున సాహిత్య క్రెడిట్ ఉండటం గమనార్హం.. బహుశా ఆయన ఈ గీతానికి మెరుగులు అద్ది ఉండాలి.. ఆ చిత్రంలో నటి కృష్ణవేణి ఈ గీతాన్ని ఆలపించగా.. ప్రస్తుత పాటను స్వయంగా ఘంటసాల వారే ఆలపించడం విశేషం.. స్వరాలు కూడా ఆయనే కూర్చి ఉండాలి.. చిత్రంలో వచ్చే గీతంలో మాత్రం అత్తనుద్దేశించి ఆట పట్టించే సన్నివేశంలో రేలంగిని చూపించడం విడ్డూరం..

గీతం : అత్త లేని కోడలుత్తమురాలు
గీత రచన : దంపుడు పాటగా ప్రసిద్ది పొందిన గ్రామీణ గీతం
(సముద్రాల సీనియర్ మెరుగులు అద్దిన గీతాన్నే ప్రస్తుతం మనము వినబోయేది)
గానం : ఘంటసాల
సంగీతం : ఘంటసాల


అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
ఆహ.. ఊహూ.. ఆహ.. ఊహూ..
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు

కోడల కోడల కొడుకు పెళ్ళామా ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడేదమ్మా .. ఆ వేడిపాలల్లోన వెన్న ఏదమ్మా
ఆహ.. ఊహూ..
అత్తమ్మ నీ చేత ఆరళ్ళే గానీ ఓలెమ్మా
పచ్చిపాలమీద మీగడుంటుందా . ఆ వేడిపాలల్లోన వెన్న ఉంటుందా
ఆహ.. ఊహూ..

అత్త లేని కోడలుత్తమురాలు ఓలెమ్మా`
కోడల్లేని అత్త గుణవంతురాలు

వంట ఇంటి లోన ఉట్టిమీదుంచిన సున్నుండలేమాయె కోడలా
మినప సున్నుండలేమాయె కోడలా …
ఆహ.. ఊహూ..
ఇంటికి పెద్దైన గండు పిల్లుండంగ ఇంకెవరు వస్తారె అత్తమ్మా
వేరే ఇంకెవరు తింటారె అత్తమ్మా …
ఛీ పో… నీ జిమ్మడా…. ఉండు నీ పని చెబుతా…

కొరవితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చిందీ
పొమ్మని కాలంట పొడ్చిందీ తేలు
అయ్యో.. అబ్బా … అమ్మా … అయ్యో
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆ… ఎందుకీ పోరని ఏడుస్తూ మా అత్త మంచి దానిమలే మళ్ళిపోయింది
ఆహ.. ఊహూ

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు

ఆహ.. ఊహూ .. అహ …

show more

Share/Embed