Balkampet Renuka Yellamma Kalyanam 2024 | Golkonda Bonalu 2024 | Telangana Bonalu 2024
ssn talks ssn talks
41.6K subscribers
827 views
5

 Published On Jul 7, 2024

Yellamma Bonalu | గోల్కొండలో ఆషాఢ తొలి బోనాలు ప్రారంభ | Golkonda Bonalu 2024 | Telangana Bonalu 2024

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ బోనాలు వైభవంగా మొదలయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజకు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ మేరకు లంగర్‌హౌస్‌ వద్ద జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డు.. మంత్రులు పట్టువస్త్రాలను అందజేశారు.ఆ తర్వాత లంగర్‌హౌస్‌ నుంచి బోనాల తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ బడాబజార్‌, ఛోటా బజార్‌ల మీదుగా కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలి పూజ ముగిసింది. పట్టు వస్త్రాలు, బంగారు బోనం, తొట్టెల ఊరేగింపుతో లంగర్‌హౌస్‌ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న బోనాలు పండుగ మొదటి పూజ అట్టహాసంగా సాగింది. లంగర్‌ హౌస్‌ నుంచి గోల్కొండ వరకు జరిగిన బోనాల ఊరేగింపులో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకొంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. భారత దేశంలో హిదువుల గురించి మాట్లాడతారు కానీ.. హిందువుల పండుగలకు సహకరించేది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. రానున్న బోనాల పండుగకు పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలన్నారు.

#bonalu
#bonalu2023
#bonalu2024
#bonalutelanganajataralu
#bonalulive
#yellammajatara
#balkampetbonalu
#golkondabonalu2024
#golkondabonalufestival

show more

Share/Embed