#HERMON
HERMON MINISTRIES HERMON MINISTRIES
8.85K subscribers
7,899 views
277

 Published On Jun 16, 2024

HERMON MINISTRIES SONGS FOR PRAYER REQUESTS CONTACT - 9848238430, 9296752517
Follow us on facebook ,INSTAGRAM and youtube- HERMON MINISTRIES KANCHIKACHERLA.
And also visit our official website- www.hermonministries.org.in
#hermon ,#hermonministries kanchikacherla ,#bro vijay kumar ,#hermonministries Ministries Karunanna,#Hermon ministries mylavaram
Telugu Lyrics...
1. కృపాకనికరము గలవాడా
||పల్లవి : కృపాకనికరము గలదేవా మహామహిమగల మహారాజా
తరతరములకు ధన్యునిగా నను చేసినది నీవేకదా
1. మితిలేనికనికరమే నన్ను బ్రతికించినది
మించిన కృపతో సంతృప్తి పరచినది
కనికరపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా
2. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది.
నీ సముఖములో నన్ను నిలిపినది
కృపాసత్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసేదా
3. విశేషకనికరమే విలువను ఇచ్చినది
వాడబారని స్వాస్థ్యం వాగ్ధానమిచ్చినది
వాత్సల్యసంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము
ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నేచేసెదా



2.. మనసారా కొలిచెదా
పల్లవి : మనసారా కొలిచెదా - మహోన్నత దైవమా
పూజ్యనీయుడా యేసయ్యా - నిత్యఆరాధనీయుడా
1. ప్రభువా నేను నిను చేరగా - నా మనవులన్నీ తీరెగా
మేళ్లతో తృప్తిపరచితివి - పూర్ణ సంతోషమిచ్చితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా
2. సిలువ బలిపీఠం నే చేరగా - నా పాపశాపం తొలిగెనుగా
నిత్యజీవం నిచ్చితివి - రక్షణనందం నిచ్చితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా
-
3. కృపాసనమును నేచేరగా సమయోచిత సాయం నొసగితివి
-
మా ప్రధాన యాజకుడా మహిమానందముతో నింపితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా



3.. మహాఘనుడా
పల్లవి : మహాఘనుడా మహోన్నతుడా
నా ఔదార్యము నీవేనయ్య- నాకున్నవన్నియు నీవే యేసయ్యా
1. మనుష్యులంతా మమేకమైనా - నా అన్నవారే సుదూరమైనా
నీవున్నావనే ఆ ధైర్యమే - నిరీక్షణతో నన్ను నింపెను
నా సంరక్షణ నీవైతివే - నా సంక్షేమము నీవే యేసయ్యా
2. నిరాశలలో నలిగియుండగా - అనుమానములే తరుముచుండగా
మహాదుర్గమై దాచితివా - మహానందము నాకిచ్చినావే
నా నమ్మకము నీవైతివే - నా నెమ్మది నీవే యేసయ్యా
3. నా పతనముకై పగవారెందరో ప్రయత్నములు నాపై చేయగా
పరాక్రమముగల శూరునివై - ప్రతిక్షణమున జయమిచ్చినావు
నా ప్రహర్షము నీవైతివే - నా ప్రఖ్యాతియు నీవే యేసయ్యా


4.. మనసారా కొలిచెదా
పల్లవి : మనసారా కొలిచెదా - మహోన్నత దైవమా
పూజ్యనీయుడా యేసయ్యా - నిత్యఆరాధనీయుడా
1. ప్రభువా నేను నిను చేరగా - నా మనవులన్నీ తీరెగా
మేళ్లతో తృప్తిపరచితివి - పూర్ణ సంతోషమిచ్చితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా
2. సిలువ బలిపీఠం నే చేరగా - నా పాపశాపం తొలిగెనుగా
నిత్యజీవం నిచ్చితివి - రక్షణనందం నిచ్చితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా
-
3. కృపాసనమును నేచేరగా సమయోచిత సాయం నొసగితివి
-
మా ప్రధాన యాజకుడా మహిమానందముతో నింపితివి
నా ప్రభువా నిను విడువను - నా జీవితకాలమంతా


5.. పరమ పురిలో
పల్లవి : పరమపురిలో ప్రియ యేసునికి - పెండ్లి కుమార్తెనై పరవశించెదను
ఎనాటిదో ఈ ఎదురుచూపు - ఎప్పుడు తీరునో ఈ ఆశ నాలో
1. నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని
-
యుగయుగములు నిత్యానందం - అనుభవించాలని
ఆ ఘడియ కొరకే నే వేచియుంటిని - యేసయ్యా తీర్చవా
2. శ్రేష్ఠమైన పట్టణములో - దీపము నీవెగా
ధవళ వస్త్రమును నేను ధరించి - సంచరింతును నీ మహిమలో
ఆ ఘడియ కొరకే నే వేచియుంటిని - యేసయ్యా తీర్చవా
3. నాకెంత భాగ్యం నీ భాగస్వామిగా - సీయోనులో చేరుట
సిద్ధపడెదను నీతిక్రియలతో - పరిశుద్ధ కన్యకగా
ఆ ఘడియ కొరకే నే వేచియుంటిని - యేసయ్యా తీర్చవా


6.. సిలువకు సాక్షిగా
పల్లవి : సిలువకు సాక్షిగా సాగిపోయెదను
-
మార్గము, సత్యము, జీవము నీవేనని
1. నా ఘోరస్థితిని మార్చితివే - నూతన సృష్టిగా చేసితివే
జీవింతును నీకోసమే - నన్ను మార్చిన శ్రీ యేసువా
సిలువే నా అతిశయం - నా స్వరం నీ కంకితం
2. ప్రాణాత్మదేహములు నీ సేవకే - జీవించుట నీ కొరకే
నన్ను నేనే లోకమునకు - సిలువవేసితి శ్రీ యేసువా
సిలువే నా అతిశయం - నా స్వరం నీ కంకితం
3. నే చాటెదన్ నీ ప్రేమను - సర్వలోకమున పాత్రనై
ఇదియే నాధన్యత - వాడుకొనుము శ్రీ యేసువా
సిలువే నా అతిశయం - నా స్వరం నీ కంకితం


7.. నీ ప్రేమ చేత నన్ను
పల్లవి : నీ ప్రేమ చేత నన్ను బంధించినావు దేవా
ప్రేమాస్వరూపి, అతికాంక్షనీయుడా - యేసయ్యా నా ప్రాణప్రియుడా
-
1. అనుదినము నీ వాత్సల్యత నూతనమగుచున్నది
-
అరుణోదయ దర్శనమే నాకు నూతన బలమిచ్చెను
-
అనాధగా నను విడువక అప్యాయతలను అందించుచున్నావు
2. అగాధ సంధ్రములు ఆర్పజాలవు - నీ ప్రేమ మధురమును
సరితూగవు నీ ప్రేమకు - ఈ లోక స్వాస్థ్యములు
పరిపూర్ణమైన ఆ ప్రేమకు - ప్రతిరూపము నీత్యాగమే
3. ఆశ్చర్యమే ఇహపరముల - నీ తనయునిగా జేసినావు
అత్యధికమైన విజయమునిచ్చి - ఆధ్యంతం నీవైతివే
విజయోత్సములలో ఉరేగింప - నీ సిలువ ధ్వజము నా
భుజమునెత్తితివే


8.. బలవంతుడా
పల్లవి : బలవంతుడా సత్యవంతుడా ఐశ్వర్యవంతుడా
నా యేసయ్యా ఆరాధన నీకే చేసెదను
1. దుర్దశలో నుండి నన్ను విడిపించుటకు
బాహువు చాపిన పరలోకపు తండ్రివి
ఎలా ఎలా వర్ణింతు నీ బలమును
2. సర్వ సత్యములో నను నడిపించుటకు
అభిషేకించిన పరిశుద్ధాత్ముడా
ఎలా ఎలా వర్ణింతు నీ శక్తిని
3. మహిమైశ్వర్యముతో నను నింపుటకు
మహిమను విడిచిన మహిమాన్వితుడా
ఎలా ఎలా వర్ణింతు నీ మహిమను

show more

Share/Embed