శివ నామమే నా గానము | Shiva Namamey Telugu Bhajan Song | Sri Vishwajyoti Bhajan Mandali, BHPV
Bhakthi Geethanjali Bhakthi Geethanjali
11.3K subscribers
49,129 views
454

 Published On Apr 5, 2022

శివ నామమే నా గానము

రచన: శ్రీ జయంతి లక్ష్మీ విశ్వనాథం
గానం : శ్రీ యమ్ సి హెచ్ వెంకట స్వామి
కీబోర్డు& పద్య రచన : రమేష్ బాబు శీపాన
డోలక్ : సుంకరి నర్సింగ రావు
కోరస్ : ఈ. వీర బ్రహ్మం, పైడి రాజు
వీడియో & ఆడియో మిక్స్ : సందీప్ శీపాన, Vizag (Ph: +91 89266 83333)
కెమెరామెన్: ఎలమంచిలి వెంకట్ (   / @y.p.rproduction3368  )

శ్రీ విశ్వజ్యోతి భజన మండలి, BHPV, VIZAG
(Ph: +91 93939 83838

కందము:
శిరమున గంగను మోయుచు
కరమున ఢమరుకము దాల్చి కడు భీకరమౌ
యురగము మెడలో నాడగ
పరికింతువు భక్త జనుల మానస తలపుల్.

పల్లవి:
శివ నామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము
అను పల్లవి:
శంభో శంకర, సాంబ సదాశివ, కైలాస వాస, గిరిజా రమణా ||శివ నామమే||

చరణం: 1
పరిపరి విధముల హరహర యంటిని
పరమాత్ముడవని ప్రార్ధించితిని
నిరతము నిన్నే కీర్తించితిని
నటన మనోహర నమశ్శివాయ ||శివ నామమే||

చరణం: 2
నీ గుణ గానము చేసెదమయ్యా
సరిగమ పదనిస స్వరములు పలుకగ
భరత నాట్య విన్యాసము చూపిన
భయ నాశంకర భవహర శంకర ||శివ నామమే||

చరణం: 3
నీ గళమందున గరళము నింపి
ప్రళయమునాపిన ప్రణవ మూర్తివే
భజనలు చేసే భక్త జనావళిని
బ్రోవగ రావా గావగ లేవా ||శివ నామమే||

మిత్రము:
నంది వాహనా! నాగాభరణా!
పార్వతి రమణా! పన్నగ భూషణ!
ఫాల విలోచన! పాప విమోచన!
పరమ దయాకర పాహి ప్రసన్నా! ||శివ నామమే||

show more

Share/Embed