Singarayakonda Famous Kodi kura | Ullapalem | Chiken Curry Early Morning Tiffin | Ongole | Food Book
Food Book Food Book
159K subscribers
593,362 views
3.8K

 Published On Feb 20, 2022

సింగరాయ కొండ మండలం ఊళ్లపాలెం గ్రామంలో బుజ్జమ్మ గారు 5 రూపాయిలకే దోశ,30రూపాయిలకు కోడి కూర ఇలా అనేక ఉపాహారాలను స్వల్ప ధరకే శుచితో రుచికరంగా అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో నేను ఇవాళ మీకు పరిచయం చేస్తున్నాను.


దోశపై కూర ఒంపినప్పుడు పులుసు అంతటా నిండుకునేలా కాస్త మందంగా, నోటికి అందించగానే వెంటనే ద్రవ రూపంమయ్యేలా మెత్తగా అట్టు వలే తయారు చేస్తారు దోశ.

పరోటను తినేటప్పుడు ప్రయాస పడకుండా సౌలభ్యంగా తినేలా పొరలపొరలుగా రుచికరంగా మలుస్తారు.

ఇక్కడ లభించు కోడి కూరను బుజ్జమ్మగారి సోదరుడు సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా తయారు చేస్తారు.స్వతహాగా ఆహార ప్రియులైన సుబ్రహ్మణ్యం గారు జనం మెచ్చే విధంగా కోడి కూరను వండుటలో అనువు అలవరుచుకున్నారు.

కూరను చూస్తున్నప్పుడు తృప్తిగా తింటున్నప్పుడు సంతృప్తిగా ఉండు విధంగా ముక్కలు పెద్దవిగా కొట్టిస్తారు.తొలుత సాధారణ మసాలా కూరకు బాగా పట్టేలా కలగల్పి ఉడికించిన తర్వాత జీడి నూకతో చేసిన పులుసు పొందించి పసందైన పల్లెటూరి కోడి కూరను తయారు చేస్తారు.
తింటున్న సందర్భాన సూక్ష్మ దృష్టితో గమనిస్తే మసాలా గుజ్జుతో ముక్కలు ఓ రుచిని, పులుసు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి.

కాసేపు దోశను పులుసులో ఉంచి తర్వాత ముక్కుతో జోడించి తింటే పరిపూర్ణ సంతృప్తి వ్యక్తం చేయువిధంగా ఉంటుంది ఆస్వాధన.
ఇక తలకాయ కూర వేపుడులా ఉన్న జీడి పులుసుతో కాస్త ముక్కలు ద్రవత్వం కలిగి మసాలా గుజ్జుతో కూర రూపంలో ఉంటుంది.దోశ తలకాయ కూర పొందిక నాకు చాలా బాగా నచ్చింది.

ఒంగోలు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వంటకాల చిత్రీకరణకు వచ్చిన ఆత్మీయ మిత్రులు ఆధాన్ శ్రీకాంత్ గారితో కలసి ఇలా ఈ కార్యక్రమంలో మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది.

సింగరాయ కొండ మండలం,ఊళ్లపాలెం బుజ్జమ్మ గారి దోశ-కోడికూర

గూగుల్ లొకేషన్:-
https://maps.app.goo.gl/jLDAArH6iDeSS...

show more

Share/Embed