17 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్న | mosambi sagu | బత్తాయి రైతు కష్టాలు | BHOOMIPUTHRA TELUGU
భూమిపుత్ర తెలుగు భూమిపుత్ర తెలుగు
9.59K subscribers
22,381 views
301

 Published On Aug 13, 2022

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
సమస్యలు ఎన్ని ఉన్నా.. బత్తాయి సాగుతో లాభాలు పొందవచ్చని, మొక్కలు ఎంపిక చేసుకునే దశ నుంచే బత్తాయి రైతు లాభాలు ఆధారపడి ఉంటాయని రైతు నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. నల్లగొండ జిల్లా, వేములుపల్లి మండలం, మొల్కపట్నం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డికి బత్తాయి తోటల సాగులో పదిహేడేళ్ల అనుభవం ఉంది. పూర్తిగా వాతావరణ పరిస్థితులపై ఆధాపడిన బత్తాయి సాగులో సమస్యంతా బత్తాయయి కాయలను అమ్ముకోవడమేనని.. దళారుల చేతుల్లో పడి రైతులు మార్కెట్ లో నిలువు దోపిడికి గురవుతున్నారని చెప్పారు. రైతు వ్యాపారిగా మారనంత వరకు లాభాలు ఆర్జించలేడని రైతు శ్రీనివాస్ రెడ్డి తన అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు.
.

రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #mosambi #బత్తాయి #cheeni #చీని #healthbenfitsofsweetlemon #healthbenfitsofmosambi #healthbenfitsofbathai
#agriculture #horticulture #poultryfarming
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

show more

Share/Embed