సాధనంబు లేక సమకూడదేదియు || VEMANA SHATHAKAM || ప్రజాకవి వేమన శతకం || My3
My3 Media My3 Media
6.11K subscribers
396 views
15

 Published On Sep 24, 2024

#vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam#vemanapoems #vemanapadyalutelugu #vemanasatakam #vemana #vemanapadyalu #vemanapadyaalu #my3 #my3media #ancientpoet #socialreformer #prajakavi #popularpoetry #padhyam116 #my3media

పద్యం - 116
------------------------
సాధనంబు లేక సమకూడదేదియు
బోధ లేని విద్య పొందదెపుడు
పాదు కొల్పి మదిని భావించి చూడరా
విశ్వదాభిరామ వినురవేమ!

మిత్రులారా!

ప్రజాకవి వేమన ఈ పద్యంలో గురువు, విద్య, శిక్షణకు పెద్ద పీఠం వేశారు. దేశానికి రాజైనా విద్య లేని వాడు, విద్య రాని వాడు వింత పశువుతో సమానం అని అని పెద్దలు చెబుతారు. అందుకే తరతరాలుగా మన దేశంలో గురువులకు తల్లి దండ్రి తర్వాతి స్థానం ఇచ్చారు.

గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు:
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మయి శ్రీ గురువేనమః

మన దేశంలో వేదాలు, శాస్త్రాలు గురువులకు అంత పెద్ద స్థానం కల్పించారు. అంతే కాకుండా గురు బోధకు అనుగుణంగా కఠోరమైన శ్రద్ధ, దీక్ష, శిక్షణ ఉన్నప్పుడే విద్య అబ్బుతుందని ఆయన అంటారు.

"సాధనంబు లేక సమకూడదేదియు
బోధ లేని విద్య పొందదెపుడు
పాదు కొల్పి మదిని భావించి చూడరా
విశ్వదాభిరామ వినురవేమ!"

ఎంత గొప్ప విద్య అయినా కఠినమైన సాధన లేకుంటే అది అబ్బదని వేమన సుస్పష్టం చేస్తున్నాడు. అదే సమయంలో గురు బోధ లేని విద్య ఎన్నటికీ రాణించదని అంటూ గురువును మనసులో దైవంగా భావించి సాధన చేస్తే ఎంత సంక్లిష్టమైన చదువు కూడా సులభంగా సాధ్యమవుతుందని వేమన చెబుతున్నాడు. అందుకే సమాజంలో నైతిక వర్తనం నాలుగు పాదాలపై నడవాలంటే గురు విద్యకు పట్టం కట్టాలని వేమన సూచిస్తున్నాడు.

ధన్యవాదాలు!
******

ప్రతి రోజూ ఒక పద్యం
మీ పిల్లల కోసం..

show more

Share/Embed