అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ప్రేమ వివాహం..
ABK Telugu ABK Telugu
1.33K subscribers
229,222 views
2.1K

 Published On Feb 12, 2022

ప్రేమకు కుల మతాలే కాదు ఖండాలు కూడా అడ్డురావని ఆ జంట నిరూపించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కృష్ణాయపాలెంనకు చెందిన గజ్జరపు వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి, అమెరికా కొలరాడో రాష్ట్రానికి చెందిన హిత్ స్ట్రీట్ వివాహం స్వగ్రామం అయినా కృష్ణాయపాలెంలో హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2016లో కొయంబత్తూరులో నిర్వహించే యోగా శిక్షణకు ఆమె వెళ్లారు. అక్కడ హిత్ స్ట్రీట్ తో పరిచయం ఏర్పడి తరువాత స్నేహం కొనసాగింది. అనంతరం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రెండేళ్ల కిందట అమెరికాకు వెళ్లడంతో ప్రేమగా మారింది. అతను అక్కడ మోడలింగ్లో రాణిస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో హఠయోగా క్లబ్ ప్రారంభించారు. ఇరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కరోనా నిబంధనల వల్ల పెండ్లికొడుకు తల్లిదండ్రులు రాలేకపోయారు.


బైట్స్ :
1. శ్రావణి (వధువు)
2. హిత్ స్ట్రీట్ (వరుడు)

show more

Share/Embed