Gugudu Kullai Swamy jaladhi video 20.08.2021
Anantapur Live NEWS Anantapur Live NEWS
6K subscribers
16,551 views
0

 Published On Aug 21, 2021

Gugudu Kullai Swamy jaladhi video 20.08.2021
jaladhi is a ceremony of last venerations to kullai swamy peer

భక్తుల మదిలో కుల్లాయిస్వామి
కనువిందు చేసిన అగ్నిగుండ ప్రవేశం
--నయనానంద కరంగా జలిది
--ఆకట్టుకున్న భజంత్రీల వాయిద్యాలు
నార్పల ఆగస్టు 20(ది జర్నలిస్ట్)
అది దేవుడు,ఆపద మొక్కులు వాడు,అనాధ రక్షకుడు శ్రీ గూగూడు కుల్లాయిస్వామి వారు.స్వామివారి ఉత్సవాలు గతపది రోజుల నుండి వైభవంగా సాగుతున్నాయి.
శుక్రవారం స్వామి వారి అగ్నిగుండ ప్రవేశం,జలది కార్యక్రమం నయనానంద జరిగింది.కరోనా నేపత్యంలో ఉత్సావాలు గుగుడు గ్రామనికే పరిమితం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా ఉత్సవాలు నిర్వహించారు.
గురువారం స్వామి వారి పెద్ద సరిగెత్తు కావడంతో ఆలయం ముందు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. సాధారణ పరిస్థితుల్లో పెద్ద సరిగెత్తు రోజు రాత్రి ఊరేగింపు చేసి వేకువజామున అగ్నిగుండం ప్రవేశం నిర్వహించి,తిరిగి సాయంత్రం మరో సారి అగ్నిగుండ ప్రవేశం చేసి అశేష జనవాహిని నడుమ కుల్లాయిస్వామి జలదికి తరలి వెళ్లేవారు.ప్రస్తుతం కరోనా నిబంధనల దృష్ట్య గురువారం రాత్రి పెద్ద సరిగేత్తు రోజు రాత్రి ఊరేగింపు, అగ్నిగుండం ప్రవేశం ఆలయ అధికారులు,రద్దు చేశారు.శుక్రవారం
వేకువజామున ఆలయ ప్రధాన అర్చకులు హుసేనప్ప కుల్లాయిస్వామి మరియు ఇతర పీర్లను ధవళ వస్త్రాలు,మేలిమి ఆభరణాలు,రంగు రంగుల పుష్పలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మాత్రమే స్వామి వారు నేరుగా అగ్నిగుండ ప్రవేశం చేసి గ్రామ విధుల్లో ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తు జలదికి తరలివెళ్లారు.స్వామి వారి అగ్నిగుండ ప్రవేశాన్ని భక్తులు మెడల మీద నుంచి తిలకించారు.భక్త జనం సందోహం నడుమ గోవిందా నామ స్వరంతో జరగాల్సిన ఉత్సవాలు బయట ప్రాంతాల భక్తులు లేక ఆలయ పరిసర ప్రాంతాలు వెలవెల బోయాయి.
ఉత్సవాల్లో భజంత్రీల నాద స్వర వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.స్వామి వారు జలదికి వెళ్లిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసి ఆలయంలో భద్రపరిచారు.ఆదివారం సాయంత్రం చివరి దర్శనం తరువాత పెట్టె లో భద్రపరుస్తారు. స్వామి వారు జలదికి వెళ్లి తిరిగి ఆలయంలోకి వచ్చిన తరువాత చిన్న సరిగెత్తు రోజు ఫక్కీరు దీక్ష తీసుకున్న భక్తులు స్వామి వారికి చదివింపులు చేసి దీక్ష విరమించారు.ఉత్సవాలకు బయట నుండి భక్తులు రాకుండా బారి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి,ఆలయ ప్రధాన అర్చకులు ఉసేనప్ప,గ్రామ సర్పంచ్ రమణకుమారి,శివయ్య,శివశంకర్ రెడ్డి,రాజా రెడ్డి,తిరుమల కొండన్న వంశీయులు, ఇటుకల పల్లి సి,ఐ విజయ భాస్కర్ గౌడ్,ఎస్సై వెంకట ప్రసాద్,ఆలయసిబ్బంది లింగారెడ్డి, జయశంకర్ కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

show more

Share/Embed