ఇంజనీరింగ్ ఎందుకు.. అమీర్ పేట్ కోచింగ్ చాలదా || Dr. Jayaprakash Narayan
JP Loksatta JP Loksatta
310K subscribers
33,290 views
842

 Published On Mar 17, 2023

#engineering #itsector #software #jayaprakashnarayana #loksatta

ఉన్నత విద్యలో కేవలం కోర్సు పుస్తకాలు మాత్రమే కాకుండా నచ్చిన సబ్జెక్టుని ఎంచుకునే అవకాశం 160 ఏళ్ల క్రితం పాశ్చాత్య దేశాల్లో వచ్చిందని, మన దేశంలో ఇప్పటికైనా తీసుకురాకపోతే ఈ జాతిని ఎవరూ క్షమించరని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Eagle Media Works ముఖాముఖిలో అన్నారు.

ఆర్థిక రంగం అసమగ్రంగా ఉండటం వల్ల మన దేశంలో ఇంజనీరింగ్ చేసినవారిలో అత్యధికులు ఐటీ రంగంలోకి వెళ్తున్నారని.. అందుకే ప్రభుత్వాలు మౌలిక వసతుల్ని నిర్మించటం, సేవారంగంతో పాటు ఉత్పత్తి రంగాన్ని పెంచటం కోసం చేసే కృషిని మనం పార్టీలకతీతంగా సమర్థించాలని, అలాగే వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో అప్ డేట్ కావటానికి అమీర్ పేట్ వంటి చోట స్వల్పకాల కోర్సుల్ని నేర్చుకోవటాన్ని ప్రతికూలాంశంగా కూడా చూడక్కర్లేదని JP వివరించారు.

show more

Share/Embed