Sapphire Reunion - '77 Alumni Guntur Medical College | Students Reunion | Dr. A V Gurava Reddy
Dr Guravareddy Annapareddy Dr Guravareddy Annapareddy
80.7K subscribers
14,459 views
332

 Published On Jul 4, 2023

గుంటూరు మెడికల్ కాలేజీ ఒక భావోద్వేగం..
అక్కడి స్నేహితులు, జ్ఞాపకాలు, చిలిపితనాలు, యవ్వనాలు అజరామరం!
45 ఏళ్ళ తరవాత, ఈ నేను, తిరిగి గుంటూరు గురివిని అయిన ఓ గొప్ప సందర్భం,
మా saffire reunion !
దీని గురించి మీకు చెపుదాం అనే ఇలా తిష్ట వేసుకొని కూర్చున్నాను!
ముడతలు వచ్చే వయస్సు లో తిరిగి మీసాలు మెలేస్తూ,
ఆ యవ్వనపు రక్తపు ఉడుకుని తిరిగి నరాల్లో నింపుకుంటూ,
మా ఈ సఫైర్ రీయూనియన్ ఎంతో ఉత్సాహంగా, ఉద్రేకపూరితంగా గడిచింది!
అరవై ఏళ్ళ వయస్సును మోసుకుంటూ వెళ్లిన మాకు,
పడుచుతనాన్ని return gift గా ఇచ్చిన ఆ రెండు రోజులని..
తిరిగి మాలోని చిలిపి తినాలని తట్టి లేపి,
చలాకితనాన్ని మళ్ళి మాలో నింపిన ఆ నిండు ఙ్ఞాపకాలని..
మనసారా మళ్ళి తలుచుకుంటూ..
అక్షరాన్ని, జ్ఞానాన్ని, అరిటాకు లో వడ్డించి పెట్టి
ఈరోజు వరకు మా ఆకలులు తీరుస్తున్న
మా గుంటూరు మెడికల్ కాలేజీని మరింత ప్రేమిస్తూ..
ఆ అద్వైత జ్ఞాపకాలని ఇలా మీతో పంచుకుందామని.....గురవారెడ్డి

show more

Share/Embed