Sr NTR అంతయు నీవే తారకరామా...LYRICAL VIDEO | CBN | NTR | Ashwin Atluri | SK Baji |
Ashwin Atluri Ashwin Atluri
7.17K subscribers
29,761 views
326

 Published On Mar 25, 2022

సినీరాజకీయ రంగాలలో అన్నగారి జైత్రయాత్ర చూసి పెరిగిన నాకు On-screen and Off-screen “హీరో” One and Only “ది లెజెండ్” ఎన్టీఆర్.

తన జీవనవిధానం, ఆశయ సాధన, పట్టుదల, అకుంఠిత దీక్ష, మాట తప్పని, మడమ తిప్పని మహోన్నత వ్యక్తిత్వం ద్వారా…మనలో మహత్తరమైన స్ఫూర్తిని నింపిన ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త ‘తెలుగు’ వారంతా ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న గారు’, విశ్వవిఖ్యాత దివ్యమోహన తేజోరూపం, గంభీర గాత్రం, మనసు మకరందం, అభిమానం అనంతం…అదే “సుగుణాభి రామ రణరంగ భీమ జగదేక సార్వభౌమ” నందమూరి తారక రామ మహాప్రస్థానం.

ఈ మహాప్రస్థానాన్ని ఒక పాటగా మలచాలంటే వ్యాస వాల్మీకులకే సాధ్యం కాదు…ఇంకా మనమెంత…మన సాహిత్యమెంత…సంద్రంలో నీటిబొట్టంత.

నేను చూసిన, నాకు తెలిసిన, నాలో వున్న అభిమానంతో, నన్ను అనుభూతికి లోను చేసిన అంశాలతో ఎంతో భక్తితో రచించిన ఈ పాటతో అన్నగారి అభిమానిగా నా జన్మ చరితార్ధమైంది.

జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్…జోహార్ ఎన్టీఆర్

అశ్విన్ అట్లూరి

show more

Share/Embed