తిరుమల దర్శనంలో మంత్రి ఆనం | Prime9 Tirupati
Prime9 Tirupati Prime9 Tirupati
1.27K subscribers
38 views
1

 Published On Sep 25, 2024

శ్రీవారి సుప్రభాత కుటుంబ సమేతంగా సేవలో పాల్గొన్న ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

తిరుమల శ్రీవారిని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం
తో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ….వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలియజేశారు. 4వ తేది ప్రారంభం అయ్యే శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు సిఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు టీటీడీ తీసుకుందని అన్నారు.

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. కల్తి వివాదం సమసిపోయింది…. దాని గురించి మల్లి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తప్పిదం ఎక్కడ జరిగిన తప్పిదమేనని తెలియజేశారు. నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలపైనే మా దృష్టి ఉందన్నారు. దోషం పోవడానికి మహా శాంతి యా
గం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహణ చేపట్టామన్నారు.

బైట్: ఆనం రామనారాయణరెడ్డి., ఏపీ దేవాదాయ శాఖ మంత్రి
| Prime9 Tirupati |
|Subscribe |

show more

Share/Embed