దశ మహావిద్యలు ! తారా ప్రత్యంగిరా దేవి కవచం ! వశీకరణం కొరకు ! DASA MAHAVIDYA ! TARA PRATYANGIRA DEVI
Gangotri Gayatri గంగోత్రి గాయత్రి Gangotri Gayatri గంగోత్రి గాయత్రి
22.7K subscribers
24,281 views
778

 Published On Sep 22, 2020

👇👇👇దయచేసి వీక్షకులు ఇది చదవండి

దశ మహావిద్యలు

సృష్టి స్థితి లయకారిణి అయిన ఆదిపరాశక్తి లోకాన్ని పాలించటానికి శ్రీ దుర్గాదేవి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ గాయత్రీదేవి, శ్రీ రాధాదేవి అనే ఐదు అవతారాల్ని ధరించిందని, వీటినే పంచప్రకృతి స్వరూపాలంటారని బ్రహ్మవైవర్త మహాపురాణం చెబుతుంది.ఇలా జగన్మాత ధరించిన అని రూపాల్లో "దశమహవిద్యలు" అనే పది రూపాలు ఎంతో విభిన్నమైనవిగా, విశిష్ఠమైనవిగా లోకములో ప్రసిద్ధిపొందాయి.

✔✔కాళీ,తార, షోడశీ,భువనేశ్వరీ, భైరవీ, ఛిన్నమస్తా, ధూమావతీ, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా అనేవి దశమహావిద్యలనామాలు.

✔✔కాళీ, తారా, బాలా, త్రిపుర భైరవి, రమా, బగళాముఖీ, మాతంగీ, త్రిపురసుందరి, కామాక్షి, తులజాదేవి, జంభినీ, మోహినీ, ఛిన్నమస్తా, గుహ్యకాళీ, దశ సాహస్ర బాహుకా అని పంచాదశ (15) శక్తులు కూడా ఆవిర్భవించాయని చెప్పబడింది.

🌸🌸🌸శ్రీతారాదేవి: 🌸🌸🌸

దశమహావిద్యలలో రెండవ మహావిద్య. నీలవర్ణముతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమితిథి ప్రీతిపాత్రమైనది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అనికూడా అంటారు. తారాదేవి సాధనవలన వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞానం, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి కలుగుతుంది.

👉ఉద్భవక్రమం:

దశ మహావిద్యలలో మొదటిదైన శ్రీకాళీ మహవిద్యతో సాధన మొదలుపెట్టి చివరిదైన శ్రీకమలాత్మిక మహావిద్యతో సాధన ముగుస్తుంది.

👉సం హార క్రమం:

దశ మహావిద్యలలో చివరిదైన శ్రీకమలాత్మిక మహావిద్యతో సాధన మొదలుపెట్టి మొదటిదైన శ్రీకాళీ మహావిద్యతో సాధన ముగుస్తుంది.

👉గృహస్తులు ఉద్భవక్రమాన్ని, సన్యాసులు సం హార క్రమాన్ని ఆచరించాలి.

ఈ దశమహావిద్యల్ని వామాచార దక్షిణాచార మార్గాల్లో ఉపాసించవచ్చు లేదా పగలు దక్షిణాచారం, రాత్రి వామాచారం అనే పద్దతిని కూడా అనుసరించవచ్చు.

🌺🌺వామాచారం:🌺🌺

మద్య, మాంస, మత్స్య, ముద్ర, మైధునం అనే పంచ మకారాలతో చేసే సాధన వామాచార సాధన అని చెప్పబడుతుంది.

🌺🌺దక్షిణాచారం:🌺🌺

పళ్ళు, పూలు, కూష్మాండం (గుమ్మడికాయ) బలి, నారికేళ బలి, ఎర్రాన్నము, నిమ్మకాయలు, కుంకుమ కలిపిన గారెలు దేవతా ప్రీతికోసం బలిగా నివేదిస్తారు.

✔✔✔పురశ్చరణకు తగిన ప్రదేశాలు:

కాళీ, తారా, ఛిన్నమస్తా వంటి దశమహావిద్యల సాధనకు ఏకలింగం వున్న శివాలయాలు, శ్మశానాలు, నిర్జనమైన అరణ్యాలు, గుహలు, యుద్ధభూములు, కంఠంలోతున నీళ్ళలో నిలబడగలిగిన నదులు.

స్వగృహములో చేసిన దానికంటే గోశాలలో 10 రెట్లు
అడవిలో చేస్తే 100 రెట్లు
నదీ తీరాల్లో 1000 రెట్లు
సముద్ర తీరాల్లో 1,00,000 రెట్లు
శివలయాల్లో 10,00,00,000 రెట్లు
గురువు సన్నిధిలో 100,00,00,000 రెట్లు

అధికఫలం లభిస్తుందని బ్రహ్మయామళ తంత్ర గ్రంథం చెబుతుంది.

🌺🌺పంచాంగ సేవనం:

మంత్ర దేవతకు సంబంధించిన గీత, సహస్రనామాలు, స్తోత్రాలు, కవచం, హృదయం సాధకులు జపంచేసిన తరవాత పఠిస్తే త్వరగా మంత్ర సిద్ధి కలుగుతుంది.

🌺🌺🌺దశ మాహావిద్యలకు ఇష్టమైన తిధులు:🌺🌺🌺

కాళీ - ఆశ్వయుజ కృష్ణ అష్టమి
తారా - చైత్ర శుక్ల నవమి
ఛిన్నమస్తా - వైశాఖ శుక్ల చతుర్ధశి
బగళాముఖీ - వైశాఖ శుక్ల అష్టమి
మాతంగీ - వైశాఖ శుక్ల తదియ
ధూమావతి - జ్యేష్ఠ శుక్ల అష్టమి
భువనేశ్వరి - భాద్రపద శుక్ల అష్టమి
షోడశి - మార్గశీర్ష పూర్ణిమ
కమలాత్మికా- మార్గశీర్ష అమావాస్య
భైరవి - మాఘ పూర్ణిమ

ఈ దేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ..

ఉపాసనాలాభిషులైన సాధకులందరికీ అభివందనాలు తెలుపుకుంటూ

గురుజన విధేయుడు
విజయేంద్ర

show more

Share/Embed